Share News

ఫోన్‌లో మాట్లాడుతూ వెళ్లి బావిలో పడ్డాడు.. చివరకు..

ABN , Publish Date - Oct 16 , 2026 | 04:51 PM

ఫోన్‌లో మాట్లాడుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి అనుకోకుండా రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయాడు. దీంతో సహాయం కోసం కేకలు వేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఫోన్‌లో మాట్లాడుతూ వెళ్లి బావిలో పడ్డాడు.. చివరకు..
Huzurabad Well Rescue

కరీంనగర్, అక్టోబర్ 16: జిల్లాలోని హుజూరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుతూ రోడ్డు పక్క నుంచి వెళ్తుండగా.. పక్కనే ఉన్న బావిలో పడిపోయాడు. ఒక్కసారిగా బావిలో పడటంతో గాయాలపాలైన అతడు బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. దీంతో సహాయం కోసం కేకలు వేశాడు. అతడి అరుపులు విన్న స్థానికులు.. అక్కడికి చేరుకున్నారు. బావిలో నీటి మట్టం తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ.. గాయాల కారణంగా అతడు ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.


సురక్షితంగా బయటకు..

ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. బావిలో పడిపోయిన వ్యక్తిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు అతడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్‌లో మాట్లాడుతూ పరిసరాలను గమనించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి...

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్.. ఫోన్ నంబర్లు ఇవే

Updated Date - Oct 16 , 2026 | 06:33 PM