Share News

ఆసుపత్రి భవనం పెచ్చులూడి మహిళకు తీవ్ర గాయాలు.. వీడియో వైరల్

ABN , Publish Date - Aug 07 , 2026 | 07:47 AM

ప్రమాదాలు ఎప్పుడు ఎలా పొంచి ఉంటాయో ఎవరూ ఊహించలేరు. రాజస్థాన్‌లోని సుజన్‌గఢ్ ప్రభుత్వ ఆసుపత్రిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద ఒక్కసారిగా భవనం పెచ్చులు ఊడిపడటంతో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది..

ఆసుపత్రి భవనం పెచ్చులూడి మహిళకు తీవ్ర గాయాలు.. వీడియో వైరల్
Rajasthan Hospital News

ఇంటర్నెట్ డెస్క్: ప్రమాదాలు ఎప్పుడు ఎలా పొంచి ఉంటాయో ఎవరూ ఊహించలేరు. రాజస్థాన్‌ చురు జిల్లాలోని సుజన్‌గఢ్‌ ఉన్న ప్రభుత్వ ఫతేపురియా మాతా శిశు ఆసుపత్రిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. హాస్పిటల్ మెయిన్ ఎంట్రెన్స్ వద్ద అకస్మాత్తుగా పైకప్పు పెచ్చులూడి మహిళపై పడ్డాయి. ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ బగాడియా ఉప-జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు.. ఆసుపత్రి సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో మెయిన్ ఎంట్రెన్స్ వద్ద రద్దీ తక్కువగా ఉండటంతో పెద్ద ముప్పు తప్పింది.


ఈ ఘటన జరిగిన వెంటనే రోగులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరిందని, మరమ్మతులు చేపట్టాలని పలుమార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. తక్షణమే ఆసుపత్రి ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

వన్డే ప్రపంచ కప్.. రోహిత్ శర్మ జట్టు నుంచి స్వచ్ఛందంగా తప్పుకోడు: మహ్మద్ కైఫ్

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 10గంటల నుంచి కరెంట్ కట్

Updated Date - Aug 07 , 2026 | 09:04 AM