Share News

విమానం స్పీకర్ బాక్స్‌లో కోట్ల విలువైన బంగారం స్మగ్లింగ్.. గుట్టు రట్టు చేసిన అధికారులు!

ABN , Publish Date - Jun 15 , 2026 | 07:43 AM

దుబాయ్ నుంచి వస్తున్న ఇండిగో విమానంలో కోట్లాది రూపాయల విలువైన బంగారాన్ని చాకచక్యంగా దాచి తరలిస్తున్న స్మగ్లింగ్ ముఠా గుట్టును కస్టమ్స్ అధికారులు రట్టు చేశారు.

విమానం స్పీకర్ బాక్స్‌లో కోట్ల విలువైన బంగారం స్మగ్లింగ్..  గుట్టు రట్టు చేసిన అధికారులు!
Gold Smuggling News

ఇంటర్నెట్ డెస్క్: దుబాయ్ నుంచి వస్తున్న ఒక ఇండిగో విమానంలో కోట్లాది రూపాయల విలువైన బంగారాన్ని చాకచక్యంగా దాచి తరలిస్తున్న స్మగ్లింగ్ ముఠా గుట్టును కస్టమ్స్ అధికారులు రట్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దుబాయ్ నుంచి వచ్చిన ఇండిగో విమానంలో పెద్ద ఎత్తున బంగారం అక్రమ రవాణా జరుగుతుందనే పక్కా సమాచారంతో కస్టమ్స్ అధికారులు రంగంలోకి దిగారు.


ఈ ఆపరేషన్‌ కోసం కస్టమ్స్ బృందం, విమాన ఇంజనీర్లు సంయుక్తంగా రంగంలోకి దిగారు. విమానంలోని అంతర్గత భాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా విమానం ముందు భాగంలో ఉన్న టాయిలెట్‌ను అధికారులు పరిశీలించారు. అక్కడ అమర్చి ఉన్న స్పీకర్ బాక్స్ లోపల నల్లటి ప్లాస్టిక్ టేపుతో అత్యంత జాగ్రత్తగా చుట్టబడిన రెండు సంచులు అధికారుల కంటపడ్డాయి. ఆ బ్యాగులను విప్పి చూడగా.. అందులో భారీ సంఖ్యలో బంగారు బిస్కెట్లు లభ్యమవడంతో అధికారులు సైతం షాక్‌కు గురయ్యారు.

24 క్యారెట్ల బంగారం 2.8 కిలోలు ఉన్నట్లు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి ధర సుమారు రూ.4.26 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే విమానాశ్రయంలో కస్టమ్స్ నిఘా తీవ్రంగా ఉండటంతో స్మగ్లర్లు ఆ బంగారాన్ని విమానంలోనే వదిలేసి పరారైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని లోతైన దర్యాప్తును ప్రారంభించారు.


ఈ వార్తలనూ చదవండి:

ఏంటీ.. మస్క్ ఇంత చిన్న ఇంట్లో ఉంటారా?

జడ్జి సీటులో కూర్చున్న మహిళ! ఆర్డర్.. ఆర్డర్.. అంటూ

Updated Date - Jun 15 , 2026 | 11:18 AM