Share News

షాకింగ్ వీడియో.. బతికున్న పామును ఎలా ఎగరేసి తినేసిందో చూడండి..

ABN , Publish Date - Jun 06 , 2026 | 12:40 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి.

షాకింగ్ వీడియో.. బతికున్న పామును ఎలా ఎగరేసి తినేసిందో చూడండి..
snake swallowed by bird

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ పక్షికి సంబంధించిన ఆసక్తికర వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Snake swallowed by bird).


సాధారణంగా కొంగలు నీటిలో ఉండే చేపలు, కప్పలను వేటాడటం మనం చూస్తుంటాం. కానీ ఈ పర్పుల్ హెరాన్ మాత్రం ఒక చిన్న పామును వేటాడింది. పామును పట్టుకున్న వెంటనే మింగేయకుండా, దాంతో కాసేపు ఆటలాడింది. తన పొడవైన ముక్కుతో ఆ పామును గాల్లోకి ఎగరేస్తూ, మళ్లీ చాకచక్యంగా నోటితో పట్టుకుంది. ఆ తర్వాత బతికుండగానే ఆ పామును మింగేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (wildlife viral video).


పర్పుల్ హెరాన్లు (Purple Heron Video) సాధారణంగా చేపలు, కప్పలు, చిన్న సరీసృపాలు, నీటిజీవులను ఆహారంగా తీసుకుంటాయి. అయితే జీవించి ఉన్న పామును ఈ విధంగా వేటాడి మింగడం అరుదుగా కనిపించే దృశ్యం. ఈ పక్షులు ప్రధానంగా యూరప్, ఆఫ్రికా, ఆసియాలోని చిత్తడి నేలలు, సరస్సులు, నదుల పరిసర ప్రాంతాల్లో కనిపిస్తాయి.


ఇవి కూడా చదవండి..

బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


నార్వేలో చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా రికార్డు..

Updated Date - Jun 06 , 2026 | 12:40 PM