Flight Baggage: ఫ్లైట్‌లో బ్యాగేజ్ పోతే ఎంత పరిహారం పొందవచ్చో తెలుసా?
ABN , Publish Date - Jan 06 , 2026 | 08:30 PM
ఫ్లైట్‌లో జర్నీ చేయడం ఇప్పట్లో సర్వసాధారణం అయింది. అయితే.. ప్రయాణ సమయంలో విమానంలో ప్రయాణికుడి బ్యాగులు పోతే పరిస్థితి ఏమిటనే ప్రశ్న అందరికీ అవసరమే. ఇదే జరిగితే.. నష్టపరిహారం ఎంతవరకూ వస్తుందో తెలుసుకుందాం.
ఆంధ్రజ్యోతి, జనవరి 6: భారత్‌లో విమాన ప్రయాణంలో బ్యాగేజ్(సామాన్లు) పోవడం, ఆలస్యం కావడం లేదా డ్యామేజ్ అవడం ఒక సాధారణ సమస్య. ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికులకు నష్టపరిహారం(కంపెన్సేషన్) పొందే హక్కు ఉంది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) నియమాల ప్రకారం డొమెస్టిక్ ఫ్లైట్స్(భారత్ లోపల) జరిగిన నష్టానికి గరిష్ఠంగా రూ. 20,000 వరకు పరిహారం పొందొచ్చు. సదరు వస్తువులు పోయినా, ఆలస్యమైనా లేదా డ్యామేజ్ అయినా ఇది వర్తిస్తుంది. క్యారేజ్ బై ఎయిర్ యాక్ట్ 1972 ప్రకారం సదరు విమాన సంస్థలు ఈ పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది.
ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌లో ప్రయాణిస్తోన్న ప్రయాణికులకు ఇలాంటి నష్టం జరిగితే మాంట్రియాల్ కన్వెన్షన్ ప్రకారం 1,131 స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDR) వరకు ఉంటుంది. అంటే.. సుమారు రూ. 1.25 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే.. SDR వాల్యూ ఆధారంగా ఇది మారుతుంది.
నష్ట పరిహారం పొందేందుకు ఏం చేయాలి?
బ్యాగేజ్ రాకపోతే వెంటనే ఎయిర్‌పోర్టులో ఎయిర్‌లైన్ కౌంటర్‌లో ప్రాపర్టీ ఇర్రెగ్యులారిటీ రిపోర్ట్(PIR) ఫైల్ చేయాలి.
ఎయిర్‌లైన్ 21 రోజుల వరకు సెర్చ్ చేస్తుంది. కనిపించకపోతే మిస్ అయినట్టుగా పరిగణిస్తారు.
క్లెయిమ్ కోసం అవసరమైన డాక్యుమెంట్స్.. బోర్డింగ్ పాస్, బ్యాగేజ్ ట్యాగ్, PIR కాపీ ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ నియమాలు ప్రయాణికుల హక్కులను కాపాడతాయి. సమస్య వస్తే వెంటనే ఎయిర్‌లైన్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. లేదా AirSewa యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మరిన్ని వివరాలకు DGCA వెబ్‌సైట్‌ను సందర్శించండి.
ఇవి కూడా చదవండి..
ఉత్తరప్రదేశ్‌లో 2.89 కోట్ల మంది ఓటర్ల తొలగింపు
తొక్కిసలాట మరణాలపై విజయ్‌కు సీబీఐ సమన్లు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి