Share News

మరణం తర్వాత శరీరం కదులుతుందా? దీని వెనుకున్న శాస్త్రీయ కారణాలు ఏంటో తెలుసా?

ABN , Publish Date - Feb 17 , 2026 | 04:20 PM

మరణం తర్వాత శరీరం కదులుతుందా? మరణం అనేది ఒక శరీరానికి అంతిమ దశ. ఈ సమయంలో శరీరం పూర్తి నిస్తేజంగా మారిపోతుంది. ఎలాంటి కదలికలూ దాదాపు ఉండవు. అయితే కొన్నిసార్లు మృతదేహం స్వల్పంగా కదిలిందని, చిన్నగా జర్క్‌లు వచ్చాయని కొందరు చెబుతుంటారు. ఇది నిజమేనా?..

మరణం తర్వాత శరీరం కదులుతుందా? దీని వెనుకున్న శాస్త్రీయ కారణాలు ఏంటో తెలుసా?
human body after death

మరణం తర్వాత శరీరం కదులుతుందా? మరణం అనేది ఒక శరీరానికి అంతిమ దశ. ఈ సమయంలో శరీరం పూర్తి నిస్తేజంగా మారిపోతుంది. ఎలాంటి కదలికలూ దాదాపు ఉండవు. అయితే కొన్నిసార్లు మృతదేహం స్వల్పంగా కదిలిందని, చిన్నగా జర్క్‌లు వచ్చాయని కొందరు చెబుతుంటారు. ఇది నిజమేనా?.. అవును.. కొన్ని సార్లు అలా జరిగే అవకాశం ఉంటుందట. దాని వెనుక శాస్త్రీయ కారణాలు ఏమిటి? తెలుసుకుందాం.. (Body moves after death)


గుండె ఆగిపోవడంతో రక్త ప్రసరణ నిలిచిపోతుంది. ఆక్సిజన్ సరఫరా లేక మెదడు కొన్ని నిమిషాల్లో పనిచేయడం ఆపేస్తుంది. అయినప్పటికీ శరీరంలోని అన్ని కణాలూ ఒకేసారి ఆగిపోవు. కొన్ని జీవరసాయన చర్యలు కొద్దిసేపు కొనసాగుతాయి. అలాగే మరణం తర్వాత కూడా కొద్దిసేపు కండరాలులో విద్యుత్ స్పందనలు కొనసాగుతాయి. దీనివల్ల చేతులు, కాళ్లు, వేళ్లు స్వల్పంగా కదిలినట్టు అనిపించవచ్చు. ఇది పూర్తిగా సహజమైన శరీర ప్రక్రియ. అంతే తప్ప జీవం తిరిగి వచ్చినట్టు కాదు (Muscle twitch after death).


మరణం తర్వాత 2 నుంచి 6 గంటల్లో కండరాలు గట్టిపడే ప్రక్రియను 'రిగర్ మార్టిస్' అంటారు. విశ్రాంతి స్థితిలో ఉన్న కండరాలు బిగుసుకుపోవడం మొదలవుతుంది. మొదట దవడ గట్టిపడుతుంది. తర్వాత మెడ, చేతులు, కాళ్లకు వ్యాపిస్తుంది. ఈ దశలో శరీరం స్థితి కొద్దిగా మారినట్టు కనిపించవచ్చు. చేతులు, కాళ్లలో కదలినట్టు అనిపించవచ్చు (Rigor mortis explanation).

మృతదేహం కుళ్ళిపోయే సమయంలో, శరీరం లోపలికి చేరిన బ్యాక్టీరియా వాయువును ఉత్పత్తి చేస్తుంది. ఇది శరీరంలో వాపు, ఒత్తిడిని కలిగిస్తుంది. గ్యాస్ ఉత్పత్తితో పాటు, సమయం గడుస్తున్న కొద్దీ కణజాలం ఎండిపోవడం, కుచించుకుపోవడం వంటి ప్రక్రియలు కాళ్లు, చేతులు కదలడానికి కారణమవుతాయి (Dead body movement facts).


2019లో, ఆస్ట్రేలియాలోని ఆస్ట్రేలియన్ టాఫోనోమిక్ ఎక్స్‌పెరిమెంటల్ రీసెర్చ్ ఫెసిలిటీ (AFTER) పరిశోధకులు 17 నెలల పాటు టైమ్-లాప్స్ కెమెరాలను ఉపయోగించి శరీరాలు కుళ్ళిపోవడాన్ని రికార్డ్ చేశారు. శరీరంలోని కణాలు ఎండిపోవడం, కండరాలు కుచించుకుపోవడం, గ్యాస్, కీటకాల కార్యకలాపాలు శరీర కదలికలకు కారణమవుతాయని పరిశోధకురాలు అలిసన్ విల్సన్ గుర్తించారు.


ఇవి కూడా చదవండి..

భర్తను అమ్మేసిన భార్య.. అతడి ప్రియురాలి దగ్గర్నుంచి ఎంత డబ్బు వసూలు చేసిందంటే..


లాభాలతో ముగిసిన దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..

Updated Date - Feb 17 , 2026 | 04:50 PM