Share News

అంగవైకల్యం అడ్డుకాదు.. వీడియో వైరల్

ABN , Publish Date - Jul 09 , 2026 | 06:14 PM

పరీక్షల్లో ఫెయిల్.. ఆత్మహత్య!. లవ్ ఫెయిల్.. ఆత్మహత్య!. లక్ష్యాన్ని చేరుకోలేక పోయాం.. ఆత్మహత్య!. వ్యాపారంలో నష్టం వచ్చింది.. ఆత్మహత్య!. అప్పులు పాలయ్యాం.. ఆత్మహత్య!. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా కూడా ఒకొక్కసారి నిరాశ, నిస్పృహలు అవరిస్తాయి.

అంగవైకల్యం అడ్డుకాదు.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: పరీక్షల్లో ఫెయిల్.. ఆత్మహత్య!. లవ్ ఫెయిల్.. ఆత్మహత్య!. లక్ష్యాన్ని చేరుకోలేక పోయాం.. ఆత్మహత్య!. వ్యాపారంలో నష్టం వచ్చింది.. ఆత్మహత్య!. అప్పులు పాలయ్యాం.. ఆత్మహత్య!. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా కూడా ఒకొక్కసారి నిరాశ, నిస్పృహలు అవరిస్తాయి. దీంతో క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడతారు. దాంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగులుస్తారు. అయితే అంగవైకల్యంతో ఉండి కూడా జొమాటో సంస్థలో ఆహార పదార్ధాలను ఓ యువతి డెలివరీ చేస్తోంది. ఆ వీడియో వైరల్ అవుతోంది. సాధారణంగా ఫుడ్ డెలివరీ మగవారికే చేస్తారు. కానీ అంగవైకల్యంతో ఉండి కూడా మూడు చక్రాల సైకిల్‌తో ఫుడ్ డెలివరి చేస్తోంది ఆమె.


ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. వేలాది మంది లైక్ చేశారు. ఆమె ధైర్యానికి, పట్టుదలకు నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలకు తలొగ్గకుండా.. సంకల్ప బలంతో ముందుకు సాగవచ్చని ఈ వీడియో వివరిస్తుందని చెబుతున్నారు. ఈ వీడియోలో ఆ యువతి.. తన విధులను పూర్తి నిజాయితీతో బాధ్యతతో నిర్వహిస్తున్నట్లు స్పష్టం అవుతుందని వివరిస్తున్నారు.


తాను ఎవరికీ భారం కాకూడదనే భావనతో ఆమె ఈ పని చేస్తున్నట్లు అర్థమవుతుంది అని పేర్కొంటున్నారు. ఇతరులకు భారంగా కాకుండా.. కష్టపడి సంపాదించి సంతృప్తికరమైన జీవితం గడపాలని కోరుకుంటుంది అని ఈ వీడియో ద్వారా స్పష్టం అవుతుందని అంటున్నారు. వైరల్ అవుతోన్న ఆ యువతి కృషిని ప్రశంసిస్తున్నారు. కష్టపడాలనే సంకల్పమే గొప్ప బలం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Updated Date - Jul 09 , 2026 | 07:36 PM