జాతీయ పక్షికి దక్కిన గౌరవం.. వీడియో వైరల్
ABN , Publish Date - Jul 14 , 2026 | 11:35 AM
ఉత్తర ఢిల్లీలోని నరేలాలో పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదవశాత్తూ పొదల్లో చిక్కుకుని, కుక్కల దాడిలో మరణించిన భారత జాతీయ పక్షి నెమలికి త్రివర్ణ పతాకం కప్పి వీడ్కోలు పలికారు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలోని నరేలాలో పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదవశాత్తూ పొదల్లో చిక్కుకుని, కుక్కల దాడిలో మరణించిన భారత జాతీయ పక్షి నెమలికి త్రివర్ణ పతాకం కప్పి వీడ్కోలు పలికారు. రాత్రిపూట విధులు నిర్వహిస్తూనే.. సమాచారం అందిన వెంటనే స్పందించి, ఒక మూగజీవికి ఇవ్వాల్సిన అత్యున్నత గౌరవాన్ని అందించిన పోలీసులపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఉత్తర ఢిల్లీలోని నరేలా పార్కులో శనివారం రాత్రి పొదల్లో చిక్కుకుని, వీధి కుక్కల దాడిలో ఒక నెమలి ప్రాణాలు కోల్పోయింది. అది గమనించిన స్థానికులు పోలీసు హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ పక్షి కళేబరాన్ని కుక్కల బారి నుంచి కాపాడారు. జాతీయ పక్షికి దక్కాల్సిన అత్యున్నత గౌరవాన్ని అందిస్తూ, సబ్-ఇన్‌స్పెక్టర్ సురేంద్ర మాలిక్ నేతృత్వంలోని పోలీస్ బృందం ఆ నెమలిని భారత త్రివర్ణ పతాకంలో చుట్టి తుది వీడ్కోలు పలికింది. అనంతరం స్థానిక నివాసితులు, ఆర్డబ్ల్యుఏ (RWA) సభ్యుల సహాయంతో పార్కులో గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు. డ్యూటీలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఒక మూగజీవి పట్ల, దేశ గౌరవ చిహ్నం పట్ల ఢిల్లీ పోలీసులు చూపిన ఈ మానవత్వానికి, దేశభక్తికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
హెలికాప్టర్ మెషిన్‌గన్‌ను నేలపై కాల్చే ప్రయత్నం.. చివరికి ఏమైందంటే..
ఇరాన్ హిట్‌లిస్ట్‌లో 13 మంది ప్రపంచ నేతలు.. ట్రంప్, నెతన్యాహు, మెలోనీ..