Share News

హెలికాప్టర్ మెషిన్‌గన్‌ను నేలపై కాల్చే ప్రయత్నం.. చివరికి ఏమైందంటే..

ABN , Publish Date - Jul 13 , 2026 | 05:56 PM

యాక్‌బీ-12.7 (YakB-12.7) రోటరీ మెషిన్‌గన్‌ అదుపుతప్పినట్లు కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అత్యంత శక్తిమంతమైన యాక్‌బీ-12.7 మెషిన్‌గన్‌ను వాస్తవానికి సోవియట్ కాలం నాటి ఎంఐ-24 (Mi-24) హెలికాప్టర్ ముందు భాగంలో అమర్చేందుకు రూపొందించారు. అయితే..

హెలికాప్టర్ మెషిన్‌గన్‌ను నేలపై కాల్చే ప్రయత్నం.. చివరికి ఏమైందంటే..
YakB 12.7 Machine Gun

మాస్కో: యాక్‌బీ-12.7 (YakB-12.7) రోటరీ మెషిన్‌గన్‌ అదుపుతప్పినట్లు కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అత్యంత శక్తిమంతమైన యాక్‌బీ-12.7 మెషిన్‌గన్‌ను వాస్తవానికి సోవియట్ కాలం నాటి ఎంఐ-24 (Mi-24) హెలికాప్టర్ ముందు భాగంలో అమర్చేందుకు రూపొందించారు. అయితే, వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. రష్యాకు చెందిన సైనికులు ఓ వాహనంపై యాక్‌బీ-12.7 మెషిన్‌గన్‌ను అమర్చారు. ఓ సైనికుడు దానిని కాల్చేందుకు సిద్ధమవగా.. మరో జవాన్ పక్కన నిల్చున్నాడు. ట్రిగ్గర్ నొక్కగానే భారీ రీకాయిల్ కారణంగా గన్ అదుపుతప్పింది.


ఓ వైపు బుల్లెట్ల వర్షం కురుస్తుండగా.. మరోవైపు గన్ అత్యంత వేగంగా తిరగడం ప్రారంభించింది. దానిని ఆపేందుకు సైనికుడు గట్టిగా పట్టుకోగా.. మెషిన్‌గన్ వేగానికి అతను ట్రక్ నుంచి కిందపడిపోయాడు. మరో సైనికుడి వైపు బుల్లెట్లు దూసుకెళ్లగా.. అతను వెంటనే కింద కూర్చొని తప్పించుకున్నాడు. అనంతరం యాక్‌బీ-12.7 రోటరీ మెషిన్‌గన్ దానంతట అదే ఆగిపోయింది. ఇదంతా క్షణాల్లోనే జరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ కావడంతో గంటల వ్యవధిలోనే వైరల్‌గా మారింది. ఈ వీడియో నిజంగా రష్యాకు చెందినదా లేదా?, ఎప్పుడు, ఎక్కడ జరిగింది? ఇందులో ఎవరైనా గాయపడ్డారా? అనే విషయాలపై ఆ దేశం ఎలాంటి అధికారిక సమాచారం విడుదల చేయలేదు. అలాగే జాతీయ మీడియా కూడా దీనిని ధ్రువీకరించడం లేదు.


అయితే, ఇది డ్రోన్లను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన రష్యా మొబైల్ ఫైర్ గ్రూప్ శిక్షణ సందర్భంగా జరిగిన సంఘటన కావచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా, యాక్‌బీ-12.7 మెషిన్‌గన్‌ను ఎంఐ-24 (Mi-24) యుద్ధ హెలికాప్టర్ ముందు భాగంలో అమర్చుతుంటారు. హెలికాప్టర్‌లో ఉండే బలమైన మౌంటింగ్ వ్యవస్థ భారీ రీకాయిల్‌ను తట్టుకునేలా ఉంటుంది. కానీ, అత్యంత శక్తిమంతమైన ఆ ఆయుధాన్ని వాహనంపై అశాస్త్రీయంగా అమర్చడంతో ప్రమాదకర పరిస్థితి ఏర్పడినట్లు నిపుణులు భావిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఇరాన్ అణు అంశంపై దౌత్యానికే ట్రంప్ ప్రాధాన్యం.. ఉల్లంఘిస్తే సైనిక చర్య తప్పదు: నెతన్యాహు

ఇరాన్ హిట్‌లిస్ట్‌లో 13 మంది ప్రపంచ నేతలు.. ట్రంప్, నెతన్యాహు, మెలోనీ..

Updated Date - Jul 13 , 2026 | 06:22 PM