వ్యక్తిపైకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు..
ABN , Publish Date - Jul 13 , 2026 | 07:38 AM
నడిరోడ్డుపై ఓ మెర్సిడెస్ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా రోడ్డుపై వెళుతున్న ఆ కారు ఓ వ్యక్తిని ఢీకొట్టింది. జనం కారును అడ్డుకునే ప్రయత్నం చేయగా.. మరో వ్యక్తిపైకి కారు ఎక్కేసింది. కొన్ని సెకన్ల పాటు కారు ఆ వ్యక్తిపై అలాగే ఉండిపోయింది.
ఇంటర్‌నెట్ డెస్క్: నడిరోడ్డుపై ఓ మెర్సిడెస్ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా రోడ్డుపై వెళుతున్న ఆ కారు ఓ వ్యక్తిని ఢీకొట్టింది. జనం కారును అడ్డుకునే ప్రయత్నం చేయగా.. మరో వ్యక్తిపైకి కారు ఎక్కేసింది. కొన్ని సెకన్ల పాటు కారు ఆ వ్యక్తిపై అలాగే ఉండిపోయింది. కారు ముందుకు కదలగానే.. కారు కిందపడ్డ వ్యక్తి క్షణాల్లో పైకి లేచాడు. ఏమీ జరగనట్లు ముందుకు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చండీగఢ్, సెక్టార్ 26లోని బాబుధామ్ కాలనీకి చెందిన అమన్‌జత్.. సెక్టార్ 44కు చెందిన అలన్స్ ప్రీత్ శనివారం సాయంత్రం డిస్కో క్లబ్‌కు వెళ్లారు. క్లబ్ నుంచి బయటకు వచ్చిన వారిపై ఓ మెర్సిడెస్ బెంజ్ కారు దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ అమన్‌జత్, అలన్స్‌లను దగ్గరిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
సంఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను సేకరించారు. సాంకేతిక ఆధారాలను ఉపయోగించి వాహనం నంబర్, డ్రైవర్ వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ సంఘటనపై స్పందిస్తూ.. ‘సీసీటీవీ ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలను ఉపయోగించి నిందితుడిని గుర్తిస్తాము. వీలైనంత త్వరగా అతడిని అరెస్ట్ చేస్తాము’ అని తెలిపారు. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో.. నల్ల బెంజ్ కారు వేగంగా రోడ్డుపై దూసుకెళ్లింది. జనం గుంపులు, గుంపులుగా రోడ్డుపైకి వచ్చేశారు. కారు నడుపుతున్న వ్యక్తి కారును రివర్స్ చేశాడు. రోడ్డుపై ఉన్న జనం పక్కకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి రోడ్డుపై ఠక్కున వచ్చేశాడు. రివర్స్‌లో వస్తున్న కారు అతడిని ఢీకొట్టింది. కిందపడ్డ అతడిపైకి వెనుక టైర్ ఎక్కింది. కొన్ని సెకన్ల పాటు అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత కారు వేగంగా ముందుకు దూసుకుపోయింది. కారు కిందపడ్డ వ్యక్తి ఠక్కున పైకి లేచాడు. ఏమీ జరగనట్లు అక్కడినుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు.