Debit Card Risky Places: డెబిట్ కార్డ్ ఈ 5 చోట్ల వాడితే.. మీ ఖాతా ఖాళీ కావొచ్చు జాగ్రత్త!
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:59 PM
ఈ డిజిటల్ యుగంలో మనీ ట్రాన్సాక్షన్స్ చాలా ఈజీ అయిపోయాయి. పేపర్ లెస్ లావాదేవీలు అన్నిచోట్లా చేస్తున్నాం. అయితే, సైబర్ ఫ్రాడ్స్ ఎక్కువైపోయిన ఈ తరుణంలో డెబిట్ కార్డ్ వాడేప్పుడు చాలా జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా ఈ ఐదు చోట్ల అత్యవసరం.
ఆంధ్రజ్యోతి, జనవరి 8: డిజిటల్ లావాదేవీలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో డెబిట్ కార్డ్ వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే, వినియోగం ఎంత పెరిగింతో అంతే స్థాయిలో ఫ్రాడ్ రిస్క్ కూడా ఎక్కువైంది. ముఖ్యంగా కొన్ని చోట్ల కార్డ్ స్వైప్ చేస్తే స్కిమ్మర్లు (కార్డ్ డేటా దొంగిలించే డివైసులు) ద్వారా మీ ఖాతా నిమిషాల్లో ఖాళీ అవ్వొచ్చు.
ఇటీవల వచ్చిన ఒక రిపోర్ట్.. 5 చోట్ల డెబిట్ కార్డ్ ఉపయోగించడం మానేయడమే మంచిదని చెబుతోంది. అవేంటో చూద్దాం..
పెట్రోల్ బంక్‌లు / గ్యాస్ స్టేషన్లు:
ఇక్కడ స్కిమ్మర్లు ఎక్కువగా ఇన్‌స్టాల్ చేసే అవకాశం ఉంది. కార్డ్ స్వైప్ చేసిన వెంటనే డేటా దొంగలించబడుతుంది. ఇలాంటి చోట్ల క్యాష్ లేదా క్రెడిట్ కార్డ్ ఉపయోగించండి.
ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు (ముఖ్యంగా అపరిచిత సైట్లు):
ఇలాంటి సైట్లలో డేటా బ్రీచ్‌లు సాధారణం. హ్యాకర్లు కార్డ్ డిటెయిల్స్ దొంగిలిస్తే.. నేరుగా బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు తీసేస్తారు.
హోటల్స్.. కార్ రెంటల్ సర్వీసులు:
ఇలాంటి చోట్ల భారీ హోల్డ్ అమౌంట్ (డిపాజిట్) పెడతారు. డెబిట్ కార్డ్ అయితే నిజమైన డబ్బు లాక్ అవుతుంది. ఫ్రాడ్ జరిగితే రికవరీ కష్టం.
రెస్టారెంట్లు లేదా చిన్న షాపులు:
వెయిటర్.. కార్డ్ తీసుకెళ్లి డిటెయిల్స్ కాపీ చేయొచ్చు లేదా స్కిమ్మర్ ఉండొచ్చు. కార్డ్ మీ చూపుల నుంచి దూరంగా పోకుండా చూసుకోండి.
ఏటీఎం మెషిన్లు (ముఖ్యంగా భద్రత లేని చోట్ల):
ఈ ప్రదేశాల్లో స్కిమ్మర్లు.. హిడన్ కెమెరాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మోసగాళ్లు పిన్ దొంగలించి మన ఖాతా ఖాళీ చేస్తారు.
సలహా:
ఇలాంటి చోట్ల క్యాష్ లేదా క్రెడిట్ కార్డ్ ఉపయోగించండి. క్రెడిట్ కార్డ్‌లో ఫ్రాడ్ జరిగితే మీ డబ్బు సేఫ్‌గా ఉంటుంది. ఎందుకంటే అది బ్యాంక్ డబ్బు. ఎప్పటికప్పుడు ట్రాన్సాక్షన్ అలర్ట్స్ చెక్ చేసి, అనుమానం వచ్చిన వెంటనే బ్యాంక్‌కు ఫిర్యాదు చేయండి. సురక్షితంగా ఉండండి.
ఇవి కూడా చదవండి...
ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్ర: సీఎం రేవంత్
ప్రభుత్వాస్పత్రిలో కత్తులతో సైకో హల్‌చల్.. భయంతో రోగుల పరుగులు
Read Latest Telangana News And Telugu News