Share News

డార్జిలింగ్‌లో టాయ్ ట్రైన్ బీభత్సం.. కారు, స్కూటర్‌ను ఢీకొట్టి..

ABN , Publish Date - Oct 13 , 2026 | 04:49 PM

డార్జిలింగ్‌లో టాయ్ ట్రైన్ ప్రమాదం కలకలం రేపింది. ఓ కారు, స్కూటర్‌ను రైలు ఢీకొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

డార్జిలింగ్‌లో టాయ్ ట్రైన్ బీభత్సం.. కారు, స్కూటర్‌ను ఢీకొట్టి..
Darjeeling Toy Train

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఆశతో కొందరు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదకరమైన పనులకు పాల్పడుతున్నారు. కదులుతున్న వాహనాల్లో నుంచి వీడియోలు తీయడం.. రద్దీగా ఉండే రోడ్లపై నిర్లక్ష్యంగా రీల్స్ చిత్రీకరించడం, ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్లి సెల్ఫీలు దిగడం వంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని సెకన్ల వీడియో కోసం చేసే ఇలాంటి సాహసాలు ఒక్కోసారి తీవ్ర ప్రమాదాలకు దారితీస్తున్నాయి. తాజాగా.. పశ్చిమ బెంగాల్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన డార్జిలింగ్‌లో చోటుచేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


డార్జిలింగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే చారిత్రాత్మక టాయ్ ట్రైన్ రోడ్డు పక్కన ఉన్న వాహనాలను ఢీకొట్టడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఇరుకైన కొండ మార్గంలో రైల్వే ట్రాక్‌కు సమీపంగా కారు, స్కూటర్ ఉండగా, ముందుకు కదిలిన రైలు వాటిని ఢీకొట్టింది. ఈ క్రమంలో స్కూటర్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు కిందపడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. టాయ్ ట్రైన్‌ను దగ్గరగా నిలబడి వీడియో తీయడానికి కొందరు ప్రయత్నిస్తున్న దృశ్యాలు కూడా కనిపించడంతో.. వైరల్ కావాలనే ఆరాటంలో భద్రతను విస్మరించడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. అయితే.. ఈ ప్రమాదంలో వాహనాలకు ఎంత మేరకు నష్టం వాటిల్లింది? అనే విషయాలపై వీడియో ద్వారా స్పష్టత రావడం లేదు.

ఈ వీడియో @pra1366 అనే యూజర్ ఎక్స్‌లో ట్వీట్ పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘రీల్స్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు..’ అని, ‘తగిన శాస్తి అయ్యింది’ అని ఒకరు, ‘రీల్స్ పిచ్చి బాగా ముదిరిపోయింది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.


ఇవీ చదవండి

ఇంచ్‌ గ్యాప్‌లో బయటపడ్డాడుగా.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

సీసీటీవీ కెమరా నుంచి తప్పించుకోలేవు బ్రో.. జాగ్రత్త! వైరల్ వీడియో

Updated Date - Oct 13 , 2026 | 05:38 PM