Share News

జెయింట్ వీల్‌పై యువకుడి ప్రమాదకర విన్యాసాలు.. వీడియో వైరల్

ABN , Publish Date - Aug 23 , 2026 | 06:24 PM

సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి కొంతమంది సాహసోపేతమైన పనులు చేస్తుంటారు. అలాంటి ఓ ప్రమాదకరమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..

జెయింట్ వీల్‌పై యువకుడి ప్రమాదకర విన్యాసాలు.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి కొంతమంది సాహసోపేతమైన పనులు చేస్తుంటారు. అలాంటి ఓ ప్రమాదకరమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కదులుతున్న జెయింట్ వీల్‌పై నిలబడి ఓ వ్యక్తి ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో జెయింట్ వీల్‌ నిరంతరం తిరుగుతుండగా.. ఆ వ్యక్తి ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకుండా దానిపై నిలబడి కనిపిస్తున్నాడు. అంత ఎత్తులో కదులుతున్న జెయింట్ వీల్‌పై నిలబడటం ఏమాత్రం సురక్షితం కాదని, చిన్నపాటి బ్యాలెన్స్ తప్పినా ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతరులను ఆకట్టుకోవడం కోసం ఇలాంటి ప్రాణాంతక విన్యాసాలు చేయడం సరికాదని పలువురు కామెంట్లు చేస్తున్నారు.


ఈ వీడియో @hasleyoriginals అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. ఈ ఘటన ఎక్కడ జరిగింది, వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు అనే వివరాలు మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. దీంతో దీనిపై ఎలాంటి ఖచ్చితమైన నిర్ధారణలకు రావడం సరికాదని పలువురు సూచిస్తున్నారు. ఏదేమైనా.. కదులుతున్న జెయింట్ వీల్‌పై ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేయడం పట్ల నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

వెలిగొండ నిర్మాణంతో.. నిర్వాసితుల జీవితాల్లో వెలుగు: లంక దినకర్

ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే మా దేశం ముక్కలవుతుంది: ఉక్రెయిన్ అధ్యక్షుడు

Updated Date - Aug 23 , 2026 | 07:23 PM