హైవేపై గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తి.. ప్రాణాలు కాపాడిన సీఆర్పీఎఫ్ జవాన్లు
ABN , Publish Date - May 14 , 2026 | 07:42 AM
విధి నిర్వహణలోనే కాదు, ప్రాణాలు కాపాడటంలోనూ తాము ఎప్పుడూ ముందే ఉంటామని సీఆర్పీఎఫ్ జవాన్లు మరోసారి నిరూపించారు. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: విధి నిర్వహణలోనే కాదు, ప్రాణాలు కాపాడటంలోనూ తాము ఎప్పుడూ ముందే ఉంటామని సీఆర్పీఎఫ్ (CRPF) జవాన్లు మరోసారి నిరూపించారు. జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారిపై ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తికి తక్షణమే స్పందించి ప్రథమ చికిత్స అందించి, ప్రాణాలు కాపాడిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బిజ్‌బెహరా సమీపంలోని జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై 90వ బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లు 'రూట్ ఓపెనింగ్ పార్టీ' (ROP) విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఒక వ్యక్తి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. అది గమనించిన జవాన్లు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతని వద్దకు చేరుకున్నారు.
వైద్య సహాయం అందడానికి సమయం పడుతుందని గ్రహించిన జవాన్లు, అతనికి తక్షణమే ప్రథమ చికిత్స (CPR) అందించారు. వారి ప్రయత్నం ఫలించి ఆ వ్యక్తి పరిస్థితి నిలకడగా మారింది. అనంతరం అతడిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. జవాన్లు సరైన సమయంలో స్పందించకపోయి ఉంటే ఫలితం మరోలా ఉండేదని ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. జవాన్ల మానవతా దృక్పథంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘దేశ రక్షణలోనే కాదు, ఆపదలో ఉన్న పౌరులను ఆదుకోవడంలోనూ మా జవాన్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు’ అని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు కొనియాడారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణలో నూతన విద్యావిధానం అమలు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
దేశంలో ఉత్తమ వేతన నమూనాలను తెలంగాణలో అమలు చేస్తాం: మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి..
Read Latest Telangana News And AP News And International News And Telugu News