ఏనుగు దగ్గరకు వెళ్లిన చిన్నారి.. ఊహించని ఘటనతో అంతా షాక్!
ABN , Publish Date - Nov 17 , 2026 | 04:11 PM
జంతు ప్రపంచంలో ప్రేమ.. నమ్మకం అనే భాషలకు ఎలాంటి హద్దులు ఉండవని చాటిచెప్పే ఒక అద్భుతమైన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రకృతి ఒడిలో మనుషులకు, జంతువులకు మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమ, నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తూ.. హృదయాలకు హత్తుకునే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అడవిలో ఇరుకైన మట్టి రోడ్డుపై ఓ భారీ ఏనుగు నిలబడి ఉంది. సాధారణంగా అంత పెద్ద ఏనుగును చూస్తే ఎవరికైనా భయం వేస్తోంది. కానీ.. చేతిలో అరటిపండు పట్టుకుని ఏమాత్రం భయం లేకుండా ఆ ఏనుగు దగ్గరకు వెళ్లిన చిన్నారి.. దానికి అరటిపండును అందించింది. దీంతో ఆ భారీ ఏనుగు తన తొండాన్ని మెల్లగా చాచి.. చిన్నారి చేతిలోని అరటిపండును ఎంతో ప్రశాంతంగా తీసుకుంది.
ఈ వీడియో haruetaijongjaingam అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేజీలో పోస్ట్ చేశారు. సుమారు 28 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో చిన్నారి చేతిలో అరటిపండుతో ఏనుగు వైపు అడుగులు వేస్తూ కనిపిస్తుంది. ఏనుగు ఎదురుగా నిలబడి తన చేతిని ముందుకు చాచి అరటిపండును అందించగా.. చిన్నారికి ఎలాంటి హానీ తలపెట్టకుండా, అరటిపండు తీసుకుంటుంది. ఈ దృశ్యం చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘బాధ్యతారహితమైన వ్యక్తిని వాహనంపై ఎప్పుడూ ప్రయాణించనివ్వవద్దు’ అని, ‘బైక్ దిగేటప్పుడు ఎల్లప్పుడూ ఇంజిన్‌ను ఆపివేయాలి’ అని ఒకరు, ‘ఆ చిన్నారి క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నా’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
వీఐపీల కోసం సింహాన్ని బైక్‌లతో తరిమిన పార్క్ సిబ్బంది.. వీడియో వైరల్
జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!