ఫైలు కదల్చని ప్రభుత్వ అధికారిణి.. వినూత్నంగా నిరసన తెలిపిన యువకుడు..
ABN , Publish Date - Apr 20 , 2026 | 03:40 PM
ప్రభుత్వ కార్యాలయంలో పని చేస్తున్న ఓ అధికారిణికి ఓ యువకుడు వినూత్నంగా తన నిరసనను తెలియజేశాడు. ఏడు నెలలుగా తన ఫైలును గాలికి వదిలేసిన ఓ అధికారిణికి ఆ యువకుడు బాదంపప్పు బహుమతిగా ఇచ్చాడు.
ప్రభుత్వ కార్యాలయంలో పని చేస్తున్న ఓ అధికారిణికి ఓ యువకుడు వినూత్నంగా తన నిరసనను తెలియజేశాడు. ఏడు నెలలుగా తన ఫైలును గాలికి వదిలేసిన ఓ అధికారిణికి ఆ యువకుడు బాదంపప్పు బహుమతిగా ఇచ్చాడు. తన ప్రాపర్టీ ఫైల్ ఏడు నెలల నుంచి కనిపించకపోవడంతో విసిగిపోయిన యువకుడు, బాదం పప్పుతో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్ హౌసింగ్ బోర్డు కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది (Bilaspur almond protest).
తరుణ్ కుమార్ అనే యువకుడు హౌసింగ్ బోర్డు ద్వారా రీసేల్‌లో ఒక ఫ్లాటు కొనుగోలు చేశాడు. దానిని తన పేరు మీదకు మార్చుకోవడానికి (మ్యుటేషన్) దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఆ కార్యాలయంలోని మహిళా అధికారిణి మాత్రం గత ఏడు నెలలుగా అతడిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. దాదాపు 50 సార్లకు పైగా ఆఫీసు చుట్టూ తిరిగినా, ఫైలు కనిపించడం లేదని, వెతుకుతున్నామని చెబుతుండడంతో తరుణ్ విసిగిపోయాడు (Missing property file).
ఆ అధికారిణికి బుద్ధి చెప్పేందుకు ఒక వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాడు (Government office delay). అర కిలో బాదం పప్పును తీసుకుని నేరుగా సదరు అధికారిణి క్యాబిన్‌లోకి వెళ్లిన తరుణ్.. ఆమె టేబుల్‌పై కుమ్మరించాడు. 'మేడమ్.. ఇవి తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అప్పుడైనా నా ఫైలు ఎక్కడ పెట్టారో మీకు గుర్తొస్తుంది. అది దొరికాక నాకు ఫోన్ చేయండి' అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెనుదిరిగాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి..
ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. ప్రీపెయిడ్ ప్లాన్ ధర పెంపు..
త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటాం.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్..