Share News

ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. ప్రీపెయిడ్ ప్లాన్ ధర పెంపు..

ABN , Publish Date - Apr 20 , 2026 | 02:44 PM

ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తన పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్ ధరను పెంచింది. 84 రోజుల వ్యాలిడిటీ కలిగిన రూ. 859 ప్లాన్ ధరను ఇప్పుడు రూ.899కు పెంచింది. అంటే వినియోగదారులు ఇకపై అదనంగా రూ.40 చెల్లించాల్సి ఉంటుంది.

ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. ప్రీపెయిడ్ ప్లాన్ ధర పెంపు..
Airtel ₹899 plan

ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తన పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్ ధరను పెంచింది. 84 రోజుల వ్యాలిడిటీ కలిగిన రూ. 859 ప్లాన్ ధరను ఇప్పుడు రూ.899కు పెంచింది. అంటే వినియోగదారులు ఇకపై అదనంగా రూ.40 చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారులకు ఎటువంటి ముందస్తు సమచారమూ లేకుండా ఈ ప్లాన్ ధరను ఎయిర్‌టెల్ పెంచేసింది (Airtel recharge price hike).


హఠాత్తుగా రూ.40 పెంచినప్పటికీ ఎటవంటి అదనపు ప్రయోజనాలు కలిగించకపోవడం గమనార్హం. 84 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ రూ.899 ప్లాన్‌పై రోజుకు 1.5 జీబీ డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు, వింక్ మ్యూజిక్, ఎయిర్‌టెల్ ఫ్రీ హలో ట్యూన్స్ వంటి బెనిఫిట్స్ అందిస్తోంది. కాగా, 77 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1.5 జీబీ డేటా అందించే రూ.799 ప్లాన్‌ను ఎయిర్‌టెల్ తొలగించింది. అయితే అందుకు గల కారణాలను వెల్లడించలేదు (Airtel ₹899 plan).


ఎయిర్‌టెల్ ప్రత్యర్థి కంపెనీ అయిన రిలయెన్స్ జియో రూ.899 ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ డేటా అందిస్తోంది (Airtel 84 day plan). కాగా వినియోగదారుల నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) పెంచడం కోసమే ఎయిర్‌టెల్ తన పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్ ధరను పెంచినట్టు తెలుస్తోంది.


ఈ వార్తలనూ చదవండి;

అమెరికాలో కాల్పులు.. 8 మంది పిల్లల మృతి

ఆ టైమ్ వచ్చింది.. ఇరాన్‌కు ట్రంప్ మరో హెచ్చరిక

Updated Date - Apr 20 , 2026 | 02:44 PM