Share News

అమెరికాలో కాల్పులు.. 8 మంది పిల్లల మృతి

ABN , Publish Date - Apr 20 , 2026 | 06:47 AM

అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం ష్రెవెపోర్ట్‌లోని నివాస సముదాయంలో...

అమెరికాలో కాల్పులు.. 8 మంది పిల్లల మృతి

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 19: అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం ష్రెవెపోర్ట్‌లోని నివాస సముదాయంలో ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. పక్కపక్కనే ఉన్న మూడు చోట్ల కనిపించిన 10 మందిపై కాల్పులు జ రపగా.. అందులో ఏడాది నుంచి 14 ఏళ్ల వయసులోపు న్న 8 మంది పిల్లలు మృతి చెందారు. కాల్పుల అనంతరం నిందితుడు కారులో పారిపోయే ప్రయత్నం చేయగా.. పోలీసులు వెంబడించారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల కాల్పుల్లో నిందితుడు మరణించాడు. కాల్పులకు గురైన వారిలో నిందితుడి బంధువులు కూడా ఉన్నట్లు సమాచా రం. ఇటు అయోవా నగరంలోని ఓ బార్‌ ముందర గొడవ జరిగి అది కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో అయో వా విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

ఈ వార్తలనూ చదవండి:

శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ

భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్‌గా మారిన ఆడియో

Updated Date - Apr 20 , 2026 | 06:47 AM