Share News

చెన్నై బస్సులో యువతి హల్‌చల్.. ప్రయాణికులతో వాగ్వాదం, దాడి..

ABN , Publish Date - Oct 07 , 2026 | 07:50 PM

చెన్నైలోని మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులో ఓ యువతి హల్‌చల్ చేసింది. మద్యం మత్తులో గుండెలు బాదుకుంటూ ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడింది. సహచర ప్రయాణికులతో వాగ్వాదానికి దిగింది. ఓ ప్రయాణికుడిపై తలపై కొట్టడంతో పాటు మరో మహిళ జుట్టు పట్టుకుని దాడి చేసింది.

చెన్నై బస్సులో యువతి హల్‌చల్.. ప్రయాణికులతో వాగ్వాదం, దాడి..
Chennai MTC Bus

ఇంటర్నెట్ డెస్క్: చెన్నైలోని మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులో ఓ యువతి హల్‌చల్ చేసింది. మద్యం మత్తులో గుండెలు బాదుకుంటూ ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడింది. సహచర ప్రయాణికులతో వాగ్వాదానికి దిగింది. ఓ ప్రయాణికుడిపై తలపై కొట్టడంతో పాటు మరో మహిళ జుట్టు పట్టుకుని దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


కిలాంబాక్కం వైపు వెళ్తున్న ఎంటీసీ బస్సు ముందు భాగంలో డ్రైవర్ పక్కన కూర్చున్న యువతి.. చుట్టూ ఉన్న ప్రయాణికులతో తీవ్ర వాగ్వాదానికి దిగింది. తాను సాధారణంగా క్యాబ్‌లోనే వెళ్తానని, బస్సులో ఎందుకు ప్రయాణించాలని ఆమె ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆమె టికెట్ తీసుకునేందుకూ నిరాకరించినట్లు తెలుస్తోంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు కొందరు ప్రయాణికులు ప్రయత్నించారు. కుటుంబ సభ్యులు లేదా తెలిసినవారి సమాచారం ఇవ్వాలని యువతిని కోరినప్పటికీ ఆమె నిరాకరించింది. ఆ తర్వాత బస్సు మొత్తం తిరుగుతూ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించింది. ఇదే సమయంలో ఆమెతో మాట్లాడేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించగా.. దాడికి పాల్పడింది. దీంతో ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను ఓ మహిళ ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.


యువతి ఆ మహిళను కొట్టేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఇద్దరూ ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. దీంతో బస్సులో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో డ్రైవర్, కండక్టర్ బస్సును నిలిపివేసి యువతిని కిందికి దించినట్లు తెలుస్తోంది. అనంతరం కుమార్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో యువతి వివరాలను పోలీసులు గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర చర్చ మొదలైంది.


ఈ వార్తలు కూడా చదవండి

అందరికీ అక్టోబర్ 2న గాంధీ జయంతి.. అక్కడ మాత్రం అక్టోబర్ 7న..

మాంసం కోసం 2,700 పిల్లుల కిడ్నాప్.. 12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..

Updated Date - Oct 07 , 2026 | 07:58 PM