బాలుడి ఫుట్‌బాల్ స్కిల్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.. వీడియో వైరల్
ABN , Publish Date - Oct 07 , 2026 | 09:24 AM
ఫుట్‌బాల్ ఆడాలంటే చేతులు అవసరం లేదు.. కానీ చేతులను వెనుకకు కట్టేసినా బంతిని అదుపులో పెట్టడం మాత్రం అంత సులభం కాదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ బాలుడి వీడియో చూస్తే ఔరా అనాల్సిందే.!
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా వేదికగా రోజూ ఎన్నో రకాల ప్రతిభకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే.. అందులో కొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురిచేస్తే, మరికొన్ని వారి టాలెంట్‌ను మెచ్చుకునేలా చేస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియోనే నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఓ బాలుడు ఫుట్‌బాల్‌తో చేస్తున్న అద్భుతమైన విన్యాసాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్న వయసులోనే ఆ బాలుడు ఫుట్‌బాల్‌ను తనదైన స్టైల్లో ఆడుతూ అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. అతడి చేతులు వెనుకకు కట్టివేసి ఉన్నప్పటికీ బంతిపై మాత్రం పూర్తి నియంత్రణతో విన్యాసాలు చేయడం. సాధారణంగా చేతుల సాయం లేకుండా ఫుట్‌బాల్‌ను ఎక్కువసేపు నియంత్రించడం అంత సులువు కాదు. కానీ ఈ బాలుడు మాత్రం పాదాలు, మోకాళ్లు, ఛాతీని ఉపయోగిస్తూ బంతిని ఎక్కువసేపు గాల్లోనే ఉంచాడు.
ఆ బాలుడు ఎంతో ప్రశాంతంగా.. ఫుట్‌బాల్‌ను ఒకసారి కూడా నేలను తాకనివ్వకుండా ఆడుతూ కనిపించాడు. బంతి ఎటువైపు వెళ్తుందో ముందుగానే అంచనా వేసి.. తన కాళ్లు, మోకాళ్లతో చాకచక్యంగా దాన్ని తిరిగి గాల్లోకి పంపుతున్న తీరు ఆకట్టుకుంటోంది. చేతులు కట్టివేసినా నియంత్రణతో ఆడటం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఈ నైపుణ్యం వెనుక బాలుడి సాధన, ఏకాగ్రత స్పష్టంగా కనిపిస్తున్నాయని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
ఈ వీడియో ‘విష్ణురియల్స్777’ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘ఆ కుర్రాడి ఆత్మ విశ్వాసం చూస్తుంటే ముచ్చటేస్తోంది’ అని, ‘టాలెంట్ ఎవరి సొత్తు కాదు’ అని ఒకరు, ‘ఈ బాలుడికి మంచి భవిష్యత్తు ఉంటుంది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
ఫిన్‌ఫ్లుయెన్సర్లతో జర జాగ్రత్త.. సెబీ చైర్మన్ సూచన