Viral Video: సైలెంట్‌గా బ్యాగు కొట్టేసింది.. సీసీటీవిలో బుక్కయ్యింది..
ABN , Publish Date - Jan 15 , 2026 | 02:52 PM
ఎక్కడైనా దొంగతనాలు జరిగితే వెంటనే అక్కడ సీసీటీవీ కెమెరాలను చెక్ చేస్తారు. ఎంతటి నేరస్తులైనా.. ఈ నిఘా నేత్రానికి చిక్కితే తప్పించుకోలేరు. ఒక మహిళ ఎంతో చాకచక్యంగా దొంగతనం చేసినా.. చివరికి సీసీటీవీ కెమెరాలో అడ్డంగా దొరికిపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్య కాలంలో జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ముఖ్యంగా షాపింగ్ మాల్స్, హూటల్స్, రెస్టారెంట్లు, దుకాణాలు, ప్రధాన వీధులతో పాటు ఇళ్ళల్లో కూడా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. అసాంఘిక కార్యాకలాపాలకు పాల్పడేవారు, దొంగలు, ఇతర ఏ నేరస్తులైనా సరే ఈ నిఘా నేత్రాల నుంచి తప్పించుకోలేరు. కెమెరాలో రికార్డ్ అయ్యే ఫుటేజ్ ద్వారా పోలీసులు ఎన్నో నేరాలను పరిష్కరించారు, పరిష్కరిస్తున్నారు. తాజాగా ఒక మహిళ చేసిన చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో.. ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్నారు. వారి వెనుక టేబుల్ వద్ద ఒక మహిళ కూర్చొంది. కుటుంబ సభ్యులు భోజనం చేసే పనిలో ఉండగా.. వాళ్లకు సంబంధించిన పర్సు నెమ్మదిగా కొట్టేసి తన బ్యాగ్‌లో సర్ధుకొని అక్కడ నుంచి జారుకుంది వెనుక కూర్చున్న మహిళ. భోజనం చేస్తున్న మహిళకు అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూడగా బ్యాగ్ మిస్సయినట్లు గమనించింది. అయితే, దొంగతనం చేస్తున్న దృశ్యాలు రెస్టారెంట్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ విజువల్స్‌ని ‘X’ ఫ్లాట్ ఫామ్‌లో @Sheetal2242 అనే ఖాతాలో పోస్ట్ చేశారు. ఇక ఆ వీడియోకి ‘సీసీటీవీ కెమెరా లేకపోతే దొంగతనం ఎంత తెలివిగా జరిగిందో మనకు ఎప్పటికీ తెలియదు’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటి వరకు 3 లక్షల మందికి పైగా వీక్షించారు.
ఇవి కూడా చదవండి..
చైనా-పాక్ ఒప్పందం చెల్లదు.. ఆ వ్యాలీ భారత్‌కు ఎందుకు కీలకం..
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..