Share News

పెళ్లిలో వరుడి అప్పగింతలు.. కన్నీళ్లు పెట్టుకున్న పెళ్లి కొడుకు..

ABN , Publish Date - Apr 19 , 2026 | 08:57 AM

ఛత్తీస్‌గఢ్‌లో ఓ విచిత్ర వివాహం జరిగింది. సాధారణంగా కల్యాణ మండపానికి వరుడు ఊరేగింపుగా వస్తాడు. పెళ్లి తర్వాత అప్పగింతల్లో వధువు కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయితే ఇక్కడ మాత్రం సీన్ రివర్స్. ఊరేగింపుతో కల్యాణ మండపానికి వచ్చిన వధువు పెళ్లి తర్వాత వరుడిని తనతో పాటు తీసుకెళ్లింది.

పెళ్లిలో వరుడి అప్పగింతలు.. కన్నీళ్లు పెట్టుకున్న పెళ్లి కొడుకు..
groom farewell wedding

ఛత్తీస్‌గఢ్‌లో ఓ విచిత్ర వివాహం జరిగింది. సాధారణంగా కల్యాణ మండపానికి వరుడు ఊరేగింపుగా వస్తాడు. పెళ్లి తర్వాత అప్పగింతల్లో వధువు కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయితే ఇక్కడ మాత్రం సీన్ రివర్స్. ఊరేగింపుతో కల్యాణ మండపానికి వచ్చిన వధువు పెళ్లి తర్వాత వరుడిని తనతో పాటు తీసుకెళ్లింది. దీనికి కారణం వరుడు ఇల్లరికం వెళ్తుండడమే (Bride leads baraat).


సాధారణ సాంప్రదాయాలను, కట్టుబాట్లను పక్కన పెట్టి నిర్వహించిన ఈ పెళ్లి వేడుక సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వధువు తండ్రి మోహన్‌కు నలుగురు కుమార్తెలు. ఆయనకు మగ పిల్లలు లేరు. దీంతో తన చివరి కుమార్తె పెళ్లికి ముందే వరుడి కుటుంబంతో ఒక ఒప్పందం చేసుకున్నారు. అల్లుడు ఇల్లరికం రావాలని కోరారు. అందుకు వరుడి కుటుంబం కూడా అంగీకరించింది. అందుకు అనుగుణంగా వివాహ ఆచారాలను మార్చారు (Groom farewell wedding).


వధువు ఊరేగింపుతో పెళ్లికి వచ్చింది. పెళ్లి అనంతరం వరుడి అప్పగింతల కార్యక్రమం నిర్వహించారు (Unique Indian wedding). వధువు చేతిలో వరుడి చేయి ఉంచి వీడ్కోలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ అప్పగింతల కార్యక్రమంలో వరుడు కన్నీళ్లు పెట్టుకోవడం విశేషం. ఈ వివాహం సమాజానికి అసాధారణంగా అనిపించినప్పటికీ, అది తమ కుటుంబానికి అవసరమని మోహన్ చెప్పాడు. అల్లుడిని తన ఇంటికి తీసుకువెళ్లి సొంత కొడుకులా చూసుకుంటానని చెప్పాడు.


ఇవి కూడా చదవండి..

దక్షిణాదికి ముందుంది ముప్పు!

అక్షయ తృతీయ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Apr 19 , 2026 | 10:20 AM