మృత్యువును జయించిన బాలుడు.. షాకింగ్ వీడియో వైరల్
ABN , Publish Date - Apr 03 , 2026 | 02:54 PM
ఇండోర్‌లోని ఓ నివాస ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలో ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు వెలుగు చూశాయి. ఓ కారు బాలుడిపై నుంచి వెళ్లినా ఆశ్చర్యంగా.. ఆ పిల్లాడు కొద్ది సేపటికే లేచి నిలబడ్డాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇండోర్‌లోని ఒక నివాస ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలో ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు వెలుగు చూశాయి. బాంబే ఆసుపత్రి వెనుక ఉన్న శాంతి నికేతన్ కాలనీలో ఇంటి బయట ఆడుకుంటున్న ఒక బాలుడిని మూల మలుపు వద్ద వేగంగా వస్తున్న కారు ఢీకొట్టి మీద నుంచి వెళ్లింది. అయితే కొన్ని క్షణాల తర్వాత, అందరినీ ఆశ్చర్య పరుస్తూ.. ఆ బాలుడు లేచి నిలబడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇండోర్‌లోని శాంతి నికేతన్ కాలనీలో బాంబే ఆసుపత్రి వెనుక కాలనీ రోడ్డుపై ఒక బాలుడు ఆడుకుంటున్నాడు. అంతలోనే సంజయ్ అగర్వాల్‌కు చెందిన కారు ఒక్కసారిగా బాలుడి పైకి దూసుకెళ్లింది. కారు బాలుడి మీదుగా వెళ్లినప్పటికీ, అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారు యజమాని సంజయ్ అగర్వాల్.. గాయపడ్డ బాలుడిని సమీప ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. బాలుడికి ఎలాంటి ప్రమాదం లేదని, కాలు విరిగినట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన తన డ్రైవర్‌ను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి
ఏసుక్రీస్తు ప్రాణాలను త్యాగం చేసిన రోజును స్మరించుకుంటున్న క్రైస్తవులు