బైక్‌కు ట్రాలీ కట్టి.. అందులో చిన్న పిల్లలతో ప్రయాణం
ABN , Publish Date - Apr 30 , 2026 | 12:16 PM
ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్ని నవ్వులు పూయిస్తే, మరికొన్ని ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్ని నవ్వులు పూయిస్తే, మరికొన్ని ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తుంటే నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం నిర్లక్ష్యమే కాదు, ఇది పసిపిల్లల ప్రాణాలతో ఆడుకోవడమేనని మండిపడుతున్నారు.
ఓ ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణిస్తున్నారు. అది చాలదన్నట్టు, ఆ బైక్ వెనుక ఓ ఇనుప ట్రాలీని తగిలించారు. ఆ ట్రాలీలో చాలా మంది చిన్న పిల్లలను కూర్చోబెట్టారు. ఎలాంటి రక్షణ కవచాలు లేని ఆ చిన్న ట్రాలీలో పిల్లలందరూ ఇరుక్కుని కూర్చున్న దృశ్యం వాహనదారులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. సాధారణంగా బైక్ బ్యాలెన్స్ చేయడం అనేది ఇద్దరు ఉన్నప్పుడే జాగ్రత్తగా ఉంటుంది. బైక్ వెనుక అంత బరువు ఉన్నప్పుడు.. మలుపుల వద్ద లేదా ట్రాఫిక్ ఉన్నప్పుడు వాహనం అదుపుతప్పే అవకాశాలు చాలా ఎక్కువ. రోడ్డుపై ఉండే స్పీడ్ బ్రేకర్ల వద్ద బైక్ ఒక్కసారిగా ఆగినా లేదా జంప్ అయినా.. వెనుక ఉన్న ట్రాలీ బోల్తాపడే అవకాశముంది. ట్రాలీకి పైన ఎలాంటి కవర్ గానీ, పట్టుకోవడానికి సరైన సదుపాయం గానీ లేదు. పొరపాటున ఏదైనా చిన్న కుదుపు వచ్చినా పిల్లలు నేరుగా రోడ్డుపై పడిపోయే ప్రమాదం ఉంది.
ఈ వీడియో @rose_k01 అనే యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘నేను ఎక్కడ చూడలేదు’ అని, ‘పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు.. ప్రమాదంలో ఉన్న విషయం తెలియదు’ అని కామెంట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..
ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే!