బైకర్ నిర్లక్ష్యం.. క్షణాల్లో భయంకర ప్రమాదం.. వీడియో వైరల్
ABN , Publish Date - Nov 25 , 2026 | 11:08 AM
రోడ్డుపై చేసే చిన్నపాటి నిర్లక్ష్యం కూడా భారీ ప్రమాదాలకు దారితీస్తుంది. తమ తొందరపాటు వల్ల ఇతరుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని కొందరు వాహనదారులు ఏమాత్రం ఆలోచించడం లేదు. తాజాగా ఓ బైకర్ చేసిన పొరపాటు కారణంగా రెండు వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: రోడ్డుపై ఒక్కరి నిర్లక్ష్యం మరొకరి ప్రాణాల మీదకు తెస్తుందని చెప్పడానికి ఈ వైరల్ వీడియోనే ఉదాహరణ. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఓ బైకర్ చేసిన తొందరపాటు రెండు వాహనాల ప్రమాదానికి కారణమైంది. రోడ్డుపై వాహనాలు వేగంగా వెళ్తున్న సమయంలో సదరు బైకర్ అకస్మాత్తుగా రోడ్డు మధ్యలో బైక్‌ను ఆపి రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. దీంతో ఎదురుగా వస్తున్న ఓ కారు డ్రైవర్ బైకర్‌ను తప్పించే క్రమంలో వాహనంపై నియంత్రణ కోల్పోయి పక్క లేన్‌లోకి వెళ్లాడు. ఈ క్రమంలో మరో వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. ప్రమాద తీవ్రతకు రోడ్డుపై దుమ్ము, పొగలు కమ్ముకున్నాయి. అయితే ఈ ప్రమాదానికి కారణమైన బైకర్ మాత్రం అక్కడ ఆగకుండా వేగంగా వెళ్లిపోవడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా? వాహనాలకు ఎంతమేర నష్టం వాటిల్లింది? అనే వివరాలు తెలియరాలేదు.
ఈ వీడియో @khurpenchh అనే యూజర్ ఎక్స్‌లో ట్వీట్ పోస్ట్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు బైకర్ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘బైకర్ నిర్లక్ష్యంతో ఎంత దారుణం జరిగిపోయింది.. ఎంతమందికి ప్రమాదం’ అని, ‘ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలి..’ అని ఒకరు, ‘పాపం యాక్సిడెంట్ చాలా దారుణంగా జరిగింది.. అతడు మాత్రం మెల్లిగా జంప్..’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, తొందరపాటు నిర్ణయాలు ఇతరుల ప్రాణాలను సైతం ప్రమాదంలో పడేస్తాయని సూచిస్తున్నారు. ఒకరి చిన్నపాటి నిర్లక్ష్యం ఎంతటి పెద్ద ప్రమాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇలా వచ్చి.. అలా సెల్ ఫోన్ కొట్టేసింది.. ఆ తర్వాత ఏం చేసిందంటే.. వీడియో వైరల్
పెళ్లిలో కోటి రూపాయల నగదు దండలు.. వరులకు బావ భారీ కానుక