విదేశాలకు యజమాని.. ఇంటిపై కారు పార్కింగ్.. వీడియో వైరల్..
ABN , Publish Date - Sep 04 , 2026 | 08:13 AM
వాహనాన్ని సురక్షితంగా ఉంచేందుకు సాధారణంగా ఇంటి ఆవరణలో.. గ్యారేజీలో లేదా పార్కింగ్ స్థలంలో పార్క్ చేస్తారు. కానీ బీహార్‌కు చెందిన ఓ మహీంద్రా స్కార్పియో క్లాసిక్ యజమాని మాత్రం అందుకు పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది..
ఇంటర్నెట్ డెస్క్: ఎవరైనా తమ వాహనాన్ని సురక్షితంగా ఉంచేందుకు సాధారణంగా ఇంటి ఆవరణలో.. గ్యారేజీలో లేదా పార్కింగ్ స్థలంలో పార్క్ చేస్తారు. కానీ.. బీహార్‌కు చెందిన ఓ మహీంద్రా స్కార్పియో క్లాసిక్ యజమాని మాత్రం అందుకు పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. విదేశాలకు వెళ్లే ముందు తన వాహనాన్ని సురక్షితంగా ఉంచేందుకు బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించినట్లు తెలుస్తోంది. క్రేన్ సహాయంతో స్కార్పియోను ఇంటి పైకప్పుపైకి ఎక్కించి పార్క్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో క్రేన్‌కు వేలాడదీసిన SUVని అత్యంత జాగ్రత్తగా భవనం పైభాగానికి తరలించడం.. అనంతరం పైకప్పుపై ఉంచడం కనిపిస్తోంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి విదేశాలకు వెళ్లే సమయంలో తన వాహనాన్ని దొంగలు ఎత్తుకెళ్లకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఒక వినూత్నమైన ఆలోచన ఆలోచించారు. క్రేన్ సహాయంతో స్కార్పియోను ఇంటి పైకప్పుపైకి ఎక్కించే ఏర్పాటును చేసినట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే.. ఈ ఘటన బీహార్‌లో ఖచ్చితంగా ఎక్కడ జరిగిందనే విషయం, యజమాని వివరాలు, అలాగే పైకప్పుపై వాహనాన్ని ఉంచేందుకు భవనం నిర్మాణపరంగా అనుకూలంగా ఉందా లేదా వంటి అంశాలు ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు.
ఈ వార్తలనూ చదవండి:
గాల్లోకి ఎగిరిన పవర్‌బోట్.. వీడియో వైరల్
పరిగెత్తండి.. తినండి.. పరిగెత్తండి.. విశ్వవిద్యాలయంలో వినూత్న ఛాలెంజ్