Share News

ప్రపోజ్ డే స్పెషల్.. ఈ గిఫ్ట్‌లతో మీ ప్రేమను వ్యక్తపరచండి..

ABN , Publish Date - Feb 08 , 2026 | 10:12 AM

వాలెంటైన్స్ వీక్‌లో భాగంగా ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే జరుపుకొంటారనే విషయం తెలిసిందే. ప్రేమను వ్యక్తపరచడానికి ఇది ప్రత్యేకమైన రోజట. ఒక గులాబీ పువ్వుతో పాటు కొన్ని గిఫ్ట్స్ ఇస్తే.. మీ ప్రపోజల్ మరింత స్పెషల్‌గా, జీవితాంతం గుర్తుండిపోయేలా మారుతుంది..

ప్రపోజ్ డే స్పెషల్.. ఈ గిఫ్ట్‌లతో మీ ప్రేమను వ్యక్తపరచండి..
Propose Day Gift Ideas

ఇంటర్నెట్ డెస్క్: వాలెంటైన్స్ వీక్‌లో రెండవ రోజు ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే జరుపుకొంటారనే విషయం తెలిసిందే. ఈ రోజు ప్రేమను వ్యక్తపరచడానికి చాలా ప్రత్యేకమైనది. చాలా మంది గులాబీ పువ్వు ఇచ్చి తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. కానీ గులాబీతో పాటు ఓ మంచి బహుమతి ఇస్తే.. ఈ రోజు మరింత గుర్తుండిపోయేలా ఉంటుంది..


టెడ్డీ బేర్:

చాలా మంది అమ్మాయిలకు టెడ్డీ బేర్ అంటే ఇష్టం. వాటిని ఎప్పుడూ తమతోనే ఉంచుకుంటారు. కాబట్టి మీరు ఒక అందమైన టెడ్డీ బేర్‌ను బహుమతిగా ఇస్తే.. దాన్ని చూసినప్పుడల్లా ఆమె మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది.

ఫ్లవర్ బొకే:

మీరు ఫ్లవర్ బొకే ఇవ్వడం ద్వారా ప్రపోజ్ డేని మరింత స్పెషల్‌గా చేయొచ్చు. చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు బహుమతుల కంటే బొకేలను ఇష్టపడతారు. అందమైన పూల బొకే ప్రేమకు చిహ్నం. బొకేతో పాటు ఓ చిన్న గ్రీటింగ్ కార్డు ఇస్తే మరింత స్పెషల్‌గా ఉంటుంది.

Flower.jpg

ఉంగరం:

ప్రపోజ్ చేసే సమయంలో ఉంగరం ఇవ్వడం చాలా రొమాంటిక్‌గా ఉంటుంది. ఇది మీ ప్రేమను, నిబద్ధతను చూపిస్తుంది. చాలా మంది అమ్మాయిలు దీన్ని ఇష్టపడతారు.


చాక్లెట్లు:

ప్రపోజల్ రోజున.. మీరు మీ భాగస్వామికి చాక్లెట్లు ఇవ్వడం ద్వారా మీ భావాలను వ్యక్తపరచవచ్చు. చాలా మంది అమ్మాయిలు ఖరీదైన వాటి కంటే చిన్న బహుమతులను ఇష్టపడతారు. కాబట్టి, మీరు మీ అమ్మాయికి చాక్లెట్లను బహుమతిగా ఇవ్వొచ్చు.

Chochaltes.jpg

బ్రాస్‌లెట్.

ప్రపోజ్ డే రోజు మీరు మీ భాగస్వామికి బ్రాస్‌లెట్‌లను కూడా బహుమతిగా ఇవ్వొచ్చు. బ్రాస్‌లెట్ ఎప్పుడూ వారితోనే ఉంటుంది. ఇది మీరు ఎప్పుడూ వారితోనే ఉన్నారని వారికి అనిపించేలా చేస్తుంది.


మేకప్ కిట్:

అమ్మాయిలు సాధారణంగా మేకప్ అంటే చాలా ఇష్టపడతారు. ఒక మంచి మేకప్ కిట్‌ను వారికి బహుమతిగా ఇవ్వొచ్చు. కాబట్టి, మీరు వారికి కొత్త మేకప్ కిట్ ఇస్తే.. వారు ఖచ్చితంగా దానిని ఇష్టపడతారు.

Beauty tips.jpg

కస్టమైజ్డ్ గిఫ్ట్:

ఇప్పుడు కస్టమైజ్డ్ గిఫ్ట్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. మీ ఫొటోలు లేదా పేర్లతో తయారు చేసిన గిఫ్ట్ ఇస్తే అది ప్రత్యేకంగా ఉంటుంది. చేతితో రాసిన ప్రేమలేఖ కూడా మంచి ఆలోచన. ఈ బహుమతుల్లో ఏదైనా ఒకటి ఇచ్చి.. ప్రపోజ్ చేస్తే ఈ రోజు మీ ఇద్దరికీ జీవితాంతం గుర్తుండిపోతుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

మునగాకు సూప్ ఎలా చేయాలో తెలుసా?

మార్కెట్లో కల్తీ అల్లం.. కొనేముందు ఇది తెలుసుకోండి.!

For More Latest News

Updated Date - Feb 08 , 2026 | 12:39 PM