పట్ట పగలే గ్యాస్ సిలిండర్ల చోరీ.. వీడియో వైరల్!
ABN , Publish Date - Mar 22 , 2026 | 12:32 PM
ఒకప్పుడు బంగారం, నగదు కోసం ఇళ్ల తాళాలు పగలగొట్టే దొంగలు.. ఇప్పుడు సామాన్యుడి వంటింట్లో గ్యాస్ సిలిండర్లపై కన్నేస్తున్నారు. బెంగళూరులో పట్ట పగలే గ్యాస్ సిలిండర్లు చోరీ చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బెంగళూరు, మార్చి22: ఒకప్పుడు బంగారం, నగదు కోసం ఇళ్ల తాళాలు పగలగొట్టే దొంగలు.. ఇప్పుడు సామాన్యుడి వంటింట్లో గ్యాస్ సిలిండర్లపై కన్నేస్తున్నారు. బెంగళూరులో పట్ట పగలే గ్యాస్ సిలిండర్లు చోరీ చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం నేపథ్యంలో భారత్‌లో ఎల్పీజీ సరఫరాలో కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే గ్యాస్ సిలిండర్లు దొంగతనాలు పెరిగిపోతున్నాయి. బెంగళూరులో ఇద్దరు వ్యక్తులు గ్యాస్ సిలిండర్లను చోరీ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో దొంగతనానికి పాల్పడటం పోలీసులకు సవాల్‌గా మారింది.
కర్ణాటక రాజధాని బెంగళూరులో గురువారం అందరూ ఉగాది పండుగ సందడిలో ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు హెల్మెట్ ధరించి ఓ అపార్ట్‌మెంట్ వద్దకు వచ్చారు. ఇద్దరిలో ఓ వ్యక్తి బయట ఉండగా.. మరోవ్యక్తి స్కూటీ తీసుకొని లోపలికి వెళ్లాడు. అనంతరం రెండు గ్యాస్ సిలిండర్లను దొంగిలించి స్కూటీపై పెట్టుకొని బయటకు వచ్చాడు. ఇద్దరు అక్కడ నుంచి ఉడాయించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. రెండు గ్యాస్ సిలిండర్లు ఒకేసారి మాయం కావడంతో ఆ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు చోరీ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం సీసీటీవీలో రికార్డైన గ్యాస్ సిలిండర్ల చోరీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవీ చదవండి:
ఏంటీ.. ప్లంబర్ వార్షిక ఆదాయం రూ.18 లక్షలా!
నదిలో కొట్టుకుపోతున్న కోతిని కాపాడిన రాఫ్టింగ్ బృందం.. వీడియో వైరల్