Share News

నదిలో కొట్టుకుపోతున్న కోతిని కాపాడిన రాఫ్టింగ్ బృందం.. వీడియో వైరల్

ABN , Publish Date - Mar 19 , 2026 | 07:55 AM

సాహసాలకు నిలయమైన ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో హృదయానికి హత్తుకునే సంఘటన జరిగింది. నదిలో కొట్టుకుపోతూ ప్రాణాలతో పోరాడుతున్న ఒక కోతిని రాఫ్టింగ్ బృందం కాపాడారు. వివరాల్లోకి వెళితే..

నదిలో కొట్టుకుపోతున్న కోతిని కాపాడిన రాఫ్టింగ్ బృందం.. వీడియో వైరల్
Monkey Rescue Viral Video

ఇంటర్నెట్ డెస్క్: సాహసాలకు నిలయమైన ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో హృదయానికి హత్తుకునే సంఘటన జరిగింది. గంగానది ఉధృతి ఎంత భయంకరంగా ఉంటుందో మనకు తెలిసిందే. అటువంటి నది మధ్య ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న ఓ కోతిని రాఫ్టింగ్ బృందం కాపాడి ఒడ్డుకు చేర్చారు. మూగజీవి కదా అని వదిలేయకుండా, ప్రతి ప్రాణం విలువైనదే అని ఆ బృందం నిరూపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


రిషికేశ్‌లో ఓ రాప్టింగ్ బృందానికి వింతైన అనుభవం ఎదురైంది. ఆ బృందానికి నది మధ్యలో ఉధృతమైన అలల మధ్య ఒక కోతి కొట్టుకుపోతూ కనిపించింది. ప్రవాహం వేగంగా ఉండటంతో అది ఒడ్డుకు చేరలేక, మునిగిపోతూ ప్రాణాల కోసం పోరాడుతోంది. కోతి ప్రమాదంలో ఉండటాన్ని గమనించిన రాఫ్టింగ్ బృందం వెంటనే రంగంలోకి దిగి, ప్రవాహాలను లెక్కచేయకుండా దానిని చేరుకుంది. ఆ కోతిని తమ బోట్‌లోకి లాగి, సురక్షిత ప్రాంతానికి చేర్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ‘మానవత్వం మరోసారి గెలిచింది’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ‘ఆ కోతికి భూమ్మీద ఇంకా నూకలున్నాయి’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి

రెయిన్ అలర్ట్.. అల్పపీడనంతో ఏపీలో భారీ వర్షాలు..

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మయిల్ ఖతీబ్ మృతి

Updated Date - Mar 19 , 2026 | 08:03 AM