Share News

షాకింగ్‌ ఘటన.. త్రుటిలో తప్పించుకున్న సెక్యూరిటీ గార్డు

ABN , Publish Date - Aug 11 , 2026 | 05:43 PM

బెంగళూరులో ఓ కారు.. అపార్ట్‌మెంట్‌ గేటును బలంగా ఢీకొట్టిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కారు దూసుకొస్తున్న సమయంలో గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు అప్రమత్తంగా పక్కకు తప్పుకోవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.

షాకింగ్‌ ఘటన.. త్రుటిలో తప్పించుకున్న సెక్యూరిటీ గార్డు
Bengaluru Security Guard Narrowly Escapes

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులో గత ఆదివారం (09/08/2026) తెల్లవారుజామున ఓ కారు.. అపార్ట్‌మెంట్‌ గేటును బలంగా ఢీకొట్టిన ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రమాదంలో గేటు వద్ద విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. తెల్లవారుజామున సుమారు 1:42 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.


వీడియోలో ఓ తెల్ల కారు వేగంగా వచ్చి అపార్ట్‌మెంట్‌ ఎంట్రెన్స్ గేటును ఢీకొట్టడం కనిపిస్తుంది. ఈ సమయంలో సెక్యూరిటీ గార్డు అదుపుతప్పి కిందపడిపోయాడు. కారు తన వైపు దూసుకొస్తున్న విషయాన్ని గుర్తించిన సెక్యూరిటీ గార్డు వెంటనే పక్కకు తప్పుకోవడంతో ప్రాణాపాయం తప్పినట్లు కనిపిస్తోంది. ఆ తర్వాత వెంటనే లేచి నిలబడ్డాడు. అతనికి పెద్దగా గాయాలు కాలేదని వీడియోను బట్టి తెలుస్తోంది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు కూడా అక్కడికి చేరుకున్నారు.


ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విస్తృతంగా వైరల్‌ అవుతోంది. అతని వేగవంతమైన స్పందనపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌ ఉన్న ప్రాంతం, ప్రమాదానికి కారణమైన కారు, దాని డ్రైవర్‌కు సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.


Also Read:

ప్రైవేటు ఆస్పత్రుల్లో గది అద్దెలకు కళ్లెం.. పార్లమెంటరీ ఆరోగ్య కమిటీ కీలక సిఫారసు..

రాహుల్ గాంధీ పక్కనున్న వారెవరు.. కేంద్ర మంత్రి ప్రశ్నలకు కాంగ్రెస్ సమాధానం ఏంటంటే..

Updated Date - Aug 11 , 2026 | 06:31 PM