Share News

ఎలుగుబంట్లను చూసి చెట్టు ఎక్కేశాడు.. చివరికి జరిగింది చూస్తే..

ABN , Publish Date - Aug 09 , 2026 | 08:13 AM

ఓ వ్యక్తిని ఎలుగుబంట్ల గుంపు చుట్టుముట్టాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు అతడు ఎక్కడు. ఎలుగుబంట్లు కూడా చెట్టుపైకి ఎక్కేందుకు ప్రయత్నించాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఎలుగుబంట్లను చూసి చెట్టు ఎక్కేశాడు.. చివరికి జరిగింది చూస్తే..
Bear Attack Viral Video

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో వన్యప్రాణులకు సంబంధించిన ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని నవ్వులు పూయించే విధంగా ఉంటే.. మరికొన్ని భయపెట్టే విధంగా ఉంటాయి. తాజాగా ఎలుగుబంటి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అడవిలో ఎలుగుబంట్ల గుంపు చుట్టుముట్టడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడుకునేందుకు చెట్టెక్కాడు. హమ్మయ్య.. బతికిపోయాననుకునే లోపే ఎలుగుబంట్లు కూడా చెట్టు వద్దకు వచ్చేశాయి. ఈ క్రమంలో చెట్టు ఎక్కేందుకూ ప్రయత్నించాయి.


సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అడవిలో ఎలుగుబంట్ల నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి వేగంగా ఓ పెద్ద చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చివరకు ఎలుగుబంట్లు కూడా చెట్టు వద్దకు చేరుకున్నాయి. ఆ ఎలుగుబంట్లు అక్కడి నుంచి వెళ్లిపోకుండా చాలా సేపు అక్కడే ఉన్నాయి. అంతటితో ఆగకుండా చెట్టుపైకి ఎక్కేందుకు ప్రయత్నించాయి. ఓ ఎలుగుబంటి అతడికి అత్యంత దగ్గరగా చేరుకుని పాదాల వద్ద ఉన్న బూటును వాసన చూస్తూ, తాకేందుకు ప్రయత్నించింది. ఎలుగుబంట్లు చెట్లను సులభంగా, వేగంగా ఎక్కగలవు. ముఖ్యంగా బ్లాక్ బేర్స్ చెట్లెక్కడంలో ఎంతో నైపుణ్యం కలిగి ఉంటాయి. వాటి బలమైన, పదునైన గోర్లు చెట్టు బెరడును గట్టిగా పట్టుకోవడానికి సహాయపడతాయి. అందుకే ఎలుగుబంటి నుంచి తప్పించుకోవడానికి చెట్టెక్కడం సురక్షితమైన మార్గం కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వీడియో చూస్తుంటే.. ఆ ఎలుగుబంట్లు పెంపుడు జంతువుల్లా అనిపిస్తున్నాయి. అయినా కూడా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి..

యూపీఐ చెల్లింపులు ఉచితమే: ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్

డీప్‌ఫేక్‌ వీడియోలపై కేంద్రం కన్నెర్ర.. చర్యలు తీసుకోవాలని మెటాకు అదేశం..

Updated Date - Aug 09 , 2026 | 09:23 AM