ఇంటి వద్దకు పెద్ద చేప కొట్టుకొచ్చిందని సంబరపడ్డారు.. తీరా చూస్తే..
ABN , Publish Date - Sep 30 , 2026 | 07:17 AM
భారీ వర్షాల సమయంలో రోడ్లు, ఇళ్లను వరద నీరు ముంచెత్తడం సర్వసాధారణం. ఓ నివాస ప్రాంతంలో కూడా ఇలాగే జరిగింది. అయితే ఆ వరద నీటిలో మొసలి కొట్టుకురావడం అందరినీ భయాందోళనకు గురిచేసింది.
ఇంటర్నెట్ డెస్క్: భారీ వర్షాల సమయంలో రోడ్లు, ఇళ్లను వరద నీరు ముంచెత్తడం సర్వసాధారణం. ఓ నివాస ప్రాంతంలో కూడా ఇలాగే జరిగింది. అయితే ఆ వరద నీటిలో మొసలి కొట్టుకురావడం అందరినీ భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటన బ్యాంకాక్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోకాలి లోతు వరద నీటితో నిండిన వీధిలో సడన్‌గా మొసలి ప్రత్యక్షమైంది.
మొసలిని జనావాస ప్రాంతం నుంచి దూరంగా తరలించేందుకు కొందరు పిల్లలు, పెద్దలు కలిసి సాహసం చేశారు. ఒకరు పొడవాటి కర్ర సాయంతో మొసలిని ఈడ్చుకుంటూ వెళ్తుండగా.. మరొకరు అతడికి సాయం చేస్తున్నాడు. ఇలా అంతా కలిసి ఆ మొసలిని ఇళ్లకు దూరంగా తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. వరదల సమయంలో మొసళ్లు, పాములు వంటివి జనావాసాల్లోకి వచ్చే అవకాశం ఉంది.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. ‘చేప అనుకుని గాలం వేస్తే పెద్ద ముసలి పడిందే’ అని కామెంట్ చేయగా, ‘వరద భయం ఆ మొసలికి కూడా ఉంది’ అని మరో నటిజన్ కామెంట్ చేశారు. ‘పెద్ద గండం గడిచింది’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
బంగారం చోరీ.. ఏమాత్రం తగ్గని యూట్యూబర్..
భారీ మొసలిని అవలీలగా ఎత్తేసిన మహిళ.. వీడియో వైరల్..