47 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల జననం.. డప్పులు, పూల వర్షంతో ఘన స్వాగతం.. వీడియో వైరల్
ABN , Publish Date - Nov 19 , 2026 | 03:49 PM
47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఓ కుటుంబంలో ఆడపిల్ల జన్మించింది. దీంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఆడపిల్ల పుట్టిందంటే ఆ ఇంట్లో ఆనందానికి అవధులుండవు. అలాంటిది సుమారు 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఓ కుటుంబంలో ఆడపిల్ల జన్మిస్తే ఆ సంబరాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్ల తర్వాత తమ కుటుంబంలోకి మహాలక్ష్మి వస్తుందన్న ఆనందంతో కుటుంబ సభ్యులు చిన్నారికి ఘన స్వాగతం పలికారు. డప్పుల మోతలు, నృత్యాలు, పూల వర్షంతో నిర్వహించిన ఈ వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. 47 ఏళ్ల తర్వాత జన్మించిన ఓ చిన్నారి రాక సందర్భంగా కుటుంబ సభ్యులు భారీగా సంబరాలు చేసుకోవడం కనిపిస్తోంది. డప్పుల మోతలకు అనుగుణంగా బంధువులు.. కుటుంబ సభ్యులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. 'వెల్కమ్ హోమ్ బేబీ' అంటూ ఏర్పాటు చేసిన భారీ బ్యానర్‌తో పాటు పై నుంచి గులాబీ రేకుల వర్షం కురిపించి చిన్నారికి స్వాగతం పలికారు. ఇంటిని గులాబీ, తెలుపు రంగు బెలూన్లు, పూలు, సీతాకోకచిలుకల అలంకరణలతో అందంగా ముస్తాబు చేశారు. 'వెల్కమ్ హోమ్ లిటిల్ ప్రిన్సెస్' అంటూ ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు చిన్నారి కోసం అందమైన కేక్‌ను కూడా సిద్ధం చేశారు. 47 ఏళ్ల తర్వాత తమ ఇంట్లోకి వచ్చిన ఆడపిల్లను యువరాణిలా స్వాగతించిన కుటుంబ సభ్యుల ఆనందం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
వీఐపీల కోసం సింహాన్ని బైక్‌లతో తరిమిన పార్క్ సిబ్బంది.. వీడియో వైరల్
జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!