Share News

ప్రతి రాష్ట్రం ఓ ప్రత్యేక ప్రపంచమే.. ఆస్ట్రేలియన్‌ యాత్రికుడి కామెంట్స్

ABN , Publish Date - Sep 30 , 2026 | 11:35 AM

భారతదేశ పర్యటనకు వచ్చిన ఓ ఆస్ట్రేలియన్‌ యాత్రికుడు.. దేశంలోని వైవిధ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ‘భారత్‌ను మీరు తక్కువగా అంచనా వేస్తున్నారు.. ప్రతి రాష్ట్రం ఓ ప్రత్యేక ప్రపంచమే’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

ప్రతి రాష్ట్రం ఓ ప్రత్యేక ప్రపంచమే.. ఆస్ట్రేలియన్‌ యాత్రికుడి కామెంట్స్
Australian Traveller

ఇంటర్నెట్ డెస్క్: భారతదేశాన్ని పర్యటిస్తున్న ఆస్ట్రేలియన్ యాత్రికుడు లూయిస్ పుల్‌మన్.. దేశంలోని భౌగోళిక, సాంస్కృతిక వైవిధ్యం తనను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని చెబుతూ సోషల్ మీడియాలో తన అనుభవాలను పంచుకున్నారు. రాజస్థాన్ ఎడారుల్లో ఒంటెలపై ప్రయాణించడం నుంచి హిమాలయాలను సందర్శించడం.. హిమాచల్‌ప్రదేశ్‌లో పారాగ్లైడింగ్ నేర్చుకోవడం వరకూ తన ప్రయాణ విశేషాలను ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించారు. పాశ్చాత్య దేశాల్లో భారత్‌పై సాధారణంగా ఉండే అభిప్రాయం.. దేశంలోని అసలు వైవిధ్యాన్ని ప్రతిబింబించదని ఆయన అన్నారు. ‘మీరంతా భారత్‌ను తక్కువగా అంచనా వేస్తున్నారు’ అంటూ తన అనుభవాన్ని వివరించారు.


ప్రస్తుతం హిమాలయాల్లో ఉన్నానని.. ఇక్కడే దలైలామా నివసించే ప్రాంతం ఉందని ఆయన చెప్పారు. కొద్ది వారాల క్రితం రాజస్థాన్‌ ఎడారిలో ఒంటెలపై ప్రయాణించానని.. మరోవైపు హిమాచల్‌ప్రదేశ్‌లో రెండున్నర వారాలుగా పారాగ్లైడింగ్‌ నేర్చుకుంటున్నానని తెలిపారు. అదే అనుభవాన్ని ఆస్ట్రేలియాలో పొందాలంటే మరింత ఖర్చయ్యేదని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి రాష్ట్రం తనకు ఒక ప్రత్యేక ప్రపంచంలా అనిపిస్తోందని పుల్‌మన్‌ పేర్కొన్నారు. పంజాబ్‌, రాజస్థాన్‌, హిమాచల్‌ప్రదేశ్‌ మూడు రాష్ట్రాల్లోనూ తనకు పూర్తిగా భిన్నమైన అనుభవాలు ఎదురయ్యాయని వివరించారు. “భారతదేశంలోని ప్రతి రాష్ట్రం ఒక ప్రత్యేక అస్తిత్వం లాంటిది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ భారత్‌ వైవిధ్యాన్ని ప్రశంసించారు. ‘మీరే స్వయంగా ఇక్కడికి రండి.. మీరు నిరాశ చెందరు’ అంటూ ఇతరులను భారత్‌ పర్యటనకు ఆయన ప్రోత్సహించారు.


ఈ వార్తలనూ చదవండి:

బంగారం చోరీ.. ఏమాత్రం తగ్గని యూట్యూబర్..

భారీ మొసలిని అవలీలగా ఎత్తేసిన మహిళ.. వీడియో వైరల్..

Updated Date - Sep 30 , 2026 | 01:29 PM