Share News

టైర్ బిగుసుకుని విలవిలలాడిన ఏనుగు.. చివరికి..

ABN , Publish Date - Sep 11 , 2026 | 08:14 AM

అడవిలో స్వేచ్ఛగా తిరగాల్సిన ఆ ఏనుగు.. మెడకు ట్రాక్టర్ టైరు బిగుసుకోవడంతో విలవిలలాడింది. అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. ట్రాక్టర్ టైరు మెడకు చుట్టుకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న అడవి ఏనుగును అటవీ అధికారులు, వన్యప్రాణి సంరక్షణ సిబ్బంది రక్షించారు.

టైర్ బిగుసుకుని విలవిలలాడిన ఏనుగు.. చివరికి..
Wild Elephant Rescue

ఇంటర్నెట్ డెస్క్: అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో ఓ అడవి ఏనుగు ఇబ్బందుల్లో చిక్కుకుంది. మెడకు ట్రాక్టర్ టైరు బిగుసుకుపోవడంతో నడవలేక, ఆహారం తీసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంది. ఏనుగు పరిస్థితిని గుర్తించిన అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. కాజిరంగాలోని వన్యప్రాణుల పునరావాస, పరిరక్షణ కేంద్రం (CWRC), గోలాఘాట్ అటవీ విభాగం సిబ్బంది స్థానికుల సహకారంతో రంగంలోకి దిగారు. ఎంతో జాగ్రత్తగా వ్యవహరించిన రెస్క్యూ బృందం ఏనుగు మెడ చుట్టూ బిగుసుకుపోయిన టైర్‌ను తొలగించింది.


ఏనుగు మెడకు టైరు ఎలా చిక్కుకుందనే విషయం మాత్రం ఇప్పటివరకూ స్పష్టంగా తెలియరాలేదు. అయితే ఈ ఘటన మనుషులు నిర్లక్ష్యంగా పారవేసే వ్యర్థాలు, వస్తువులు.. వన్యప్రాణులకు ఎంతటి ప్రమాదాన్ని కలిగిస్తాయో మరోసారి స్పష్టం చేసింది. ముఖ్యంగా అడవులకు సమీపంలోని ప్రాంతాల్లో ప్లాస్టిక్, టైర్లు, ఇతర వ్యర్థాలను విచ్చలవిడిగా పడేయడం వల్ల జంతువులు ప్రమాదాల్లో చిక్కుకునే అవకాశం ఉందంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కుక్కపిల్లతో ఆప్యాయంగా ఆడుతున్న బాలిక.. నెటిజన్ల ఫిదా

హుండీలో భక్తుల కోరికల చిట్టా.. నా కోరిక నెరవేరిస్తే మందు మానేస్తా స్వామీ..!

For More Weather News And Telugu News

Updated Date - Sep 11 , 2026 | 09:34 AM