Share News

ఇక్కడి ఆతిథ్యాన్ని మర్చిపోలేను.. బీహార్‌పై అమెరికన్ యాత్రికుడి ప్రశంసల వర్షం

ABN , Publish Date - Jun 03 , 2026 | 05:09 PM

బీహార్ అనగానే సోషల్ మీడియాలో తరచూ నెగెటివ్ వార్తలే కనిపిస్తుంటాయి. కానీ, ఒక అమెరికన్ యాత్రికుడి కంటితో చూస్తే బీహార్ ఎంత అందంగా ఉంటుందో, అక్కడి ప్రజలు ఎంత ఆప్యాయంగా ఉంటారో అర్థమవుతుంది.

ఇక్కడి ఆతిథ్యాన్ని మర్చిపోలేను.. బీహార్‌పై అమెరికన్ యాత్రికుడి ప్రశంసల వర్షం
American Traveler in Bihar

ఇంటర్నెట్ డెస్క్: బీహార్ రాష్ట్రం గురించి సోషల్ మీడియాలో తరచూ కొన్ని ప్రతికూల అభిప్రాయాలు, కథనాలు ప్రచారంలో అవుతుంటాయి. అయితే, ఒక అమెరికన్ యాత్రికుడు బీహార్ అందాలను, అక్కడి ప్రజల ఆతిథ్యాన్ని, ఉత్సాహభరితమైన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసిన తీరు ఆ ప్రతికూల ప్రచారాలన్నింటినీ పూర్తిగా తుడిచిపెట్టేసింది. ప్రస్తుతం అతనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అమెరికాకు చెందిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్ టోనీ క్లోర్ ఇటీవల బీహార్‌లోని మాన్సీ నుంచి భాగల్పూర్ వరకూ పర్యటించారు. ఈ ప్రయాణానికి సంబంధించిన విశేషాలను ఆయన ఒక వీడియో రూపంలో పంచుకున్నారు.


టోనీ ప్రయాణం గంగా నదిపై నిర్మాణంలో ఉన్న ఒక వంతెన వద్దకు చేరుకున్నప్పుడు ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. వంతెన పూర్తికాకపోవడంతో ముందుకు ఎలా వెళ్లాలో తెలియక ఆయన కాసేపు అయోమయానికి గురయ్యారు. ఆ తర్వాత టోనీ అక్కడి స్థానికులతో మాట్లాడి.. భాగల్పూర్ చేరుకోవడానికి నదిని దాటేందుకు పడవ మార్గం ఒక్కటే ప్రత్యామ్నాయమని తెలుసుకున్నారు. వెంటనే ఒక మోటారు పడవ ఎక్కి తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఆ పడవ ప్రయాణంలో స్థానిక ప్రయాణికులతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు. అక్కడి ఆహార అలవాట్లు, పానీయాల గురించి స్థానికులను అడిగి తెలుసుకుంటూ వారి సంస్కృతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు.

టోనీ మాట్లాడుతూ.. ‘బీహారీ ప్రజలు చాలా మంచివారు, వారు ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితిలోనైనా వారు మీకు లిఫ్ట్ ఇస్తారు. బీహార్ చాలా అందంగా ఉంది. నా జీవితంలోనే అత్యంత సంతోషకరమైన క్షణాలను నేను ఇక్కడ ఆస్వాదించాను’ అని అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి..

అనవసర బలవంతం తగదు.. వందేమాతరం పూర్తి గేయంపై శశిథరూర్

బీజేపీకి తమిళనాడు నేత అన్నామలై రాజీనామా

Updated Date - Jun 03 , 2026 | 05:54 PM