బైక్ స్టంట్ అదిరింది అనుకునేలోపే... ఊహించని ట్విస్ట్! వీడియో వైరల్
ABN , Publish Date - Jun 02 , 2026 | 02:51 PM
బైక్ ఎక్కితే చాలు.. కొందరికి ఒళ్లు తెలియని ఉత్సాహం వచ్చేస్తుంది. రోడ్డుపై వెళ్లే వాహనం కాస్తా, గాల్లో విన్యాసాలు చేసే వేదికగా మారిపోతుంది. సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా స్టంట్లు చేసే వీరులను మనం రోజూ చూస్తూనే ఉంటాం. అయితే, కొన్నిసార్లు సీన్ రివర్స్ అవుతుంది.. సరిగ్గా అలాంటి ఒక ఫన్నీ ఇన్సిడెంట్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో చాలా మందికి బైక్ అనేది కేవలం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళడానికి ఉపయోగించే వాహనం మాత్రమే కాదు. రోడ్డుపై విన్యాసాలు చేస్తూ, నలుగురిలో గొప్పలు చెప్పుకోవడానికి అదొక సాధనంగా మారిపోయింది. సోషల్ మీడియా వాడకం పెరిగినప్పటి నుంచి ఇలాంటి బైక్ స్టంట్ల వీడియోలు మనకు నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. వాటిలో కొన్ని వీడియోలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటే, మరికొన్ని మాత్రం చూసేవారికి కడుపుబ్బా నవ్వు తెప్పిస్తాయి.
వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక వ్యక్తి బైక్‌పై విన్యాసాలు చేస్తూ కనిపించాడు. అతను బైక్‌ను వేగంగా నడుపుతూ.. సీటుపై ఒక విచిత్రమైన భంగిమలో కూర్చున్నాడు. బ్యాలెన్స్ తప్పకుండా ఉండటం కోసం ఒక చేత్తో సీటును గట్టిగా పట్టుకుని, తన కాలును గాలిలోకి పైకి లేపి, వెనక్కి వంగి నిలబడ్డాడు. 'అబ్బా.. ఎంత బాగా చేస్తున్నాడో' అని మనం అనుకునే లోపే సీన్ రివర్స్ అయ్యింది. గాల్లో కాలు పెట్టి స్టంట్ చేసిన ఆ వ్యక్తి, ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయి బైక్ పైనుంచి కింద పడిపోయాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియో @Nalanda_index అనే యూజర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘అతని ఎముకలు కొన్ని విరిగి ఉంటే బాగుండేది’ అని, ‘పాత బైకులపై విన్యాసం అంటే ఇలాగే ఉంటుంది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
పింఛన్లను రూ.4వేలకు పెంచిన ఘనత చంద్రబాబుదే: ఎమ్మెల్సీ అనురాధ..
పారదర్శకంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నాం: ఎమ్మెల్యే వసంత