గిన్నిస్ రికార్డుల్లోకి స్మార్ట్ ఫోన్.. 30 కిలోమీటర్ల ఎత్తు నుంచి..
ABN , Publish Date - Aug 30 , 2026 | 10:27 AM
సాధారణంగా రెండు మూడు అడుగుల ఎత్తు నుంచి సెల్ ఫోన్ కింద పడితే ముక్కలవుతుంది. కానీ.. 30 కిలోమీటర్లకు పైగా ఎత్తు నుంచి ఓ స్మార్ట్‌ఫోన్‌ను కిందకు పడేశారు. అయితే.. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్.. 30,607 మీటర్ల ఎత్తు నుంచి నేలపై పడినా కూడా ఫోన్‌కు ఏమీ కాలేదు..
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా రెండు మూడు అడుగుల ఎత్తు నుంచి సెల్ ఫోన్ కింద పడితే ముక్కలవుతుంది. కానీ.. 30 కిలోమీటర్లకు పైగా ఎత్తు నుంచి ఓ స్మార్ట్‌ఫోన్‌ను కిందకు పడేశారు. అయితే.. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్.. 30,607 మీటర్ల ఎత్తు నుంచి నేలపై పడినా కూడా ఫోన్‌కు ఏమీ కాలేదు. ఈ ఏడాది జూన్ 24న స్వీడన్‌లోని కిరునా ప్రాంతంలో ఆశ్చర్యకరమైన ప్రయోగం జరిగింది.
ఓ స్మార్ట్‌ఫోన్‌ను ఏకంగా 30,607 మీటర్ల ఎత్తు నుంచి కిందకు వదిలారు. దాదాపు 30 కిలోమీటర్ల ఎత్తు నుంచి భూమివైపు దూసుకొచ్చిన ఫోన్.. సుమారు 25 నిమిషాల పాటు ప్రయాణించి స్వీడన్‌లోని అరణ్య ప్రాంతంలో పడింది. అంత ఎత్తు నుంచి పడినప్పటికీ ఫోన్ దెబ్బతినకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఫోన్‌ను ఆన్ కావడంతో యథావిధిగా పని చేస్తోంది. ఈ వినూత్న ప్రయోగం.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది.
ఈ ప్రయోగాన్ని RHINOSHIELD.. యూకేకు చెందిన Sent Into Space సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. ఫోన్ సురక్షితంగా ఉండటంలో RHINOSHIELD రూపొందించిన AirX ప్రొటెక్టివ్ కేస్ కీలక పాత్ర పోషించినట్లు నిర్వాహకులు తెలిపారు. అధిక వేగంతో భూమిని ఢీకొట్టే సమయంలో ఏర్పడే శక్తిని గ్రహించి.. దానిని విస్తరించే విధంగా ఈ కేస్‌ను రూపొందించారు. సుమారు 30 కిలోమీటర్ల ఎత్తులో ఉండే తీవ్రమైన వాతావరణ పరిస్థితులను కూడా పరికరం తట్టుకుంది. అక్కడ ఉష్ణోగ్రతలు సుమారు -40°C నుంచి -60°C వరకు పడిపోవడంతో పాటు, వాతావరణ పీడనం సముద్ర మట్టంతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది.
ఇదిలా ఉంటే.. నిజంగా అంతరిక్షం నుంచి ఫోన్‌ను జారవిడిచిన ఘటన కాదు. ఫోన్‌ను స్ట్రాటోస్ఫియర్ వరకు మాత్రమే తీసుకెళ్లారు. ఇది సాధారణ వాణిజ్య విమానాలు ప్రయాణించే ఎత్తు కంటే ఎంతో ఎక్కువ అయినప్పటికీ.. అంతరిక్ష సరిహద్దుగా సాధారణంగా పరిగణించే 100 కిలోమీటర్ల కార్మన్ రేఖ కంటే చాలా దిగువన ఉంటుంది. అందువల్ల దీనిని అంతరిక్షం నుంచి పడేసిన ఫోన్‌గా కాకుండా, స్ట్రాటోస్ఫియర్ నుంచి అత్యంత ఎత్తు నుంచి జారవిడిచిన పరికరంగా పేర్కొనడం కచ్చితమైనది. సహజ భూభాగంపై ప్రొటెక్టివ్ కేస్‌తో ఉన్న మొబైల్ ఫోన్‌ను అత్యంత ఎత్తు నుంచి వదిలిన విన్యాసంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఈ ప్రయోగాన్ని గుర్తించింది.
ఇవి కూడా చదవండి..
ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఆయిల్ డీల్.. వెనెజువెలాతో ఒప్పందంపై ట్రంప్ ప్రకటన..
స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..