వనపర్తిలో ఘనంగా వినాయక నిమజ్జనం

ABN, Publish Date - Sep 24 , 2026 | 09:11 PM

జిల్లా కేంద్రం వనపర్తిలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. చివరి రోజు పలుచోట్ల ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిమజ్జనం ఊరేగింపును చేపట్టారు.

వనపర్తిలో ఘనంగా వినాయక నిమజ్జనం 1/6

జిల్లా కేంద్రం వనపర్తిలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. చివరి రోజు పలుచోట్ల ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిమజ్జనం ఊరేగింపును చేపట్టారు.

వనపర్తిలో ఘనంగా వినాయక నిమజ్జనం 2/6

వినాయక మండపాల వద్ద గురువారం ఉదయం నుంచే భక్తుల సందడి నెలకొంది. గణనాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

వనపర్తిలో ఘనంగా వినాయక నిమజ్జనం 3/6

ఆ తర్వాత డప్పులు, వాయిద్యాల నడుమ భక్తులు వినాయక విగ్రహాలను ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు.

వనపర్తిలో ఘనంగా వినాయక నిమజ్జనం 4/6

యువత, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు గణపతి బప్పా మోరియా అంటూ నినాదాల చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు.

వనపర్తిలో ఘనంగా వినాయక నిమజ్జనం 5/6

నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు, పోలీసులు చర్యలు చేపట్టారు.

వనపర్తిలో ఘనంగా వినాయక నిమజ్జనం 6/6

వినాయక ఉత్సవాల చివరి రోజు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తిలోని పలు గణేష్ మండపాలను సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated at - Sep 24 , 2026 | 09:23 PM