హైదరాబాద్‌లో 27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలకు హాజరైన బండి సంజయ్

ABN, Publish Date - Nov 21 , 2026 | 06:47 AM

హైదరాబాద్‌లోని సీఆర్‌పీఎఫ్ గ్రూప్ సెంటర్‌లో నిర్వహించిన 27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీల ముగింపు వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. పురుషుల ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన సీఆర్‌పీఎఫ్‌కు అభినందనలు తెలిపారు.

హైదరాబాద్‌లో 27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలకు హాజరైన బండి సంజయ్ 1/5

హైదరాబాద్‌లోని సీఆర్‌పీఎఫ్ గ్రూప్ సెంటర్‌లో నిర్వహించిన 27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీల ముగింపు వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. పురుషుల ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన సీఆర్‌పీఎఫ్‌కు అభినందనలు తెలిపారు.

హైదరాబాద్‌లో 27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలకు హాజరైన బండి సంజయ్ 2/5

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. పోలీస్ బ్యాండ్ పోటీల ముగింపు వేడుకకు హాజరవడం చాలా ఆనందంగా ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో 27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలకు హాజరైన బండి సంజయ్ 3/5

పురుషుల ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌లో ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచిన సీఆర్పీఎఫ్‌కు, 2వ, 3వ స్థానాలు సాధించిన మహారాష్ట్ర పోలీస్, రాజస్థాన్ పోలీస్‌కు, 4వ స్థానంలో నిలిచిన తెలంగాణ పోలీస్‌కు అభినందనలు తెలిపారు.

హైదరాబాద్‌లో 27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలకు హాజరైన బండి సంజయ్ 4/5

పోలీస్ బ్యాండ్‌లు మన భద్రతా దళాల క్రమశిక్షణ, అంకితభావం, ఐక్యత, అసాధారణ ప్రతిభను ప్రతిబింబిస్తాయని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు. మన దేశాన్ని రక్షించే అవే చేతులు మన హృదయాలను స్పృశించే సంగీతాన్ని కూడా సృష్టిస్తాయని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దార్శనిక నాయకత్వంలో, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో , మన ప్రభుత్వం మన పోలీసు బలగాలను ఆధునీకరించడానికి, మన ధైర్యవంతులైన సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమాన్ని బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని చెప్పారు.

హైదరాబాద్‌లో 27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలకు హాజరైన బండి సంజయ్ 5/5

ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, ఇందులో పాల్గొన్న 21 జట్లకు, సీఆర్పీఎఫ్‌కు అభినందనలు తెలిపారు. ఈ స్ఫూర్తిదాయకమైన గీతాలు భారతదేశం అంతటా ప్రతిధ్వనిస్తూనే ఉండాలని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆశించారు.

Updated at - Nov 21 , 2026 | 07:05 AM