తెలంగాణలో గిగ్ వర్కర్ల సంక్షేమ పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ
ABN, Publish Date - Nov 14 , 2026 | 01:41 PM
తెలంగాణలో గిగ్ వర్కర్ల సంక్షేమ పథకాన్ని లోక్‌సభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించారు. గిగ్ వర్కర్ల విధివిధానాల పుస్తకాన్ని ఆవిష్కరించారు. అంతేకాకుండా గిగ్ వర్కర్ల సంక్షేమ పథకానికి సంబంధించిన బోర్డును కూడా రాహుల్ ఆవిష్కరించారు. గిగ్ వర్కర్లకు రక్షణ కల్పిస్తానని ఆనాడు మాట ఇచ్చానని.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ఈ సందర్భంగా ఏఐసీసీ అగ్రనేత అన్నారు. అంతకుముందు గిగ్ వర్కర్లు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. శిల్పకలా వేదిక నుంచి జయభేరి గ్రౌండ్స్ వరకు గిగ్ వర్కర్లతో కలిసి బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పాల్గొన్నారు.
1/8
తెలంగాణలో గిగ్ వర్కర్ల సంక్షేమ పథకాన్ని లోక్‌సభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించారు. గిగ్ వర్కర్ల విధివిధానాల విడుదల చేయడంతో పాటు.. గిగ్ వర్కర్ల సంక్షేమ పథకానికి సంబంధించిన బోర్డును కూడా రాహుల్ ఆవిష్కరించారు.
2/8
గిగ్ వర్కర్లకు రక్షణ కల్పిస్తానని ఆనాడు మాట ఇచ్చా.. వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం: రాహుల్ గాంధీ
3/8
గిగ్ వర్కర్లకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చామని రాహుల్ తెలిపారు. గిగ్ వర్కర్లకు రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తాం: రాహుల్
4/8
తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్లకు గ్యారంటీ ఇస్తుంది. ఇప్పటి వరకు దేశంలో గిగ్ వర్కర్స్ డేటా లేదు. ఇప్పటి నుంచి మీ వివరాలను ఎక్కడైనా చూసుకోవచ్చు. మీకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది: రాహుల్
5/8
కాంగ్రెస్ అంటేనే మాటకు కట్టుబడి ఉండే పార్టీ. రాహుల్ మాట ఇస్తే తప్పరు. చాలా మంది అభిప్రాయాలను తీసుకుని చట్టం రూపొందించాం. గిగ్ వర్కర్లను ఆదుకునేందుకే కాంగ్రెస్ పార్టీ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
6/8
గిగ్ వర్కర్లతో కలిసి ఫొటోలు దిగిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తదితరులు
7/8
మహిళా గిగ్ వర్కర్‌ను ఆప్యాయంగా పలకరించి.. ఆమెతో కలిసి ఫొటో దిగిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ.
8/8
గిగ్ వర్కర్లు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. శిల్పకలా వేదిక నుంచి జయభేరి గ్రౌండ్స్ వరకు గిగ్ వర్కర్లతో కలిసి బైక్ ర్యాలీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పాల్గొన్నారు.
Updated at - Nov 14 , 2026 | 01:47 PM