ఎస్పీజీ కంటే బాగా పనిచేస్తుందనే ముద్ర ఐఎస్‌డబ్ల్యూకు ఉంది: ఏడీజీ విజయ్ కుమార్

ABN, Publish Date - Feb 18 , 2026 | 08:09 AM

తెలంగాణ పోలీస్ శాఖకు దేశంలోనే నంబర్‌వన్‌గా పేరున్నట్లే అంతర్గత భద్రత విభాగం (ఐఎస్‌డబ్ల్యూ)కూ సైతం అలాంటి పేరే ఉందని ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్ తెలిపారు. ఎస్పీజీ కంటే బాగా పనిచేస్తుందనే ముద్ర ఐఎస్‌డబ్ల్యూకు ఉందని చెప్పారు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లలో జాగిలాల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు.

ఎస్పీజీ కంటే బాగా పనిచేస్తుందనే ముద్ర ఐఎస్‌డబ్ల్యూకు ఉంది: ఏడీజీ విజయ్ కుమార్ 1/17

తెలంగాణ పోలీస్ శాఖకు దేశంలోనే నంబర్‌వన్‌గా పేరున్నట్లే అంతర్గత భద్రత విభాగం (ఐఎస్‌డబ్ల్యూ)కూ కూడా అలాంటి పేరే ఉందని ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్ తెలిపారు.

ఎస్పీజీ కంటే బాగా పనిచేస్తుందనే ముద్ర ఐఎస్‌డబ్ల్యూకు ఉంది: ఏడీజీ విజయ్ కుమార్ 2/17

ఎస్పీజీ కంటే బాగా పనిచేస్తుందనే ముద్ర ఐఎస్‌డబ్ల్యూకు ఉందని చెప్పారు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లలో వీటి పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు.

ఎస్పీజీ కంటే బాగా పనిచేస్తుందనే ముద్ర ఐఎస్‌డబ్ల్యూకు ఉంది: ఏడీజీ విజయ్ కుమార్ 3/17

మంగళవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ (ఐఐటీఏ)లో 25వ జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు.

ఎస్పీజీ కంటే బాగా పనిచేస్తుందనే ముద్ర ఐఎస్‌డబ్ల్యూకు ఉంది: ఏడీజీ విజయ్ కుమార్ 4/17

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏడీజీ విజయ్ కుమార్ హాజరయ్యారు. తెలంగాణ అంతర్గత భద్రత విభాగం ఓఎస్‌డీ వి.బి.కమలాసన్ రెడ్డి సమక్షంలో ఈ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు.

ఎస్పీజీ కంటే బాగా పనిచేస్తుందనే ముద్ర ఐఎస్‌డబ్ల్యూకు ఉంది: ఏడీజీ విజయ్ కుమార్ 5/17

ఈ సందర్భంగా జాగిలాల ప్రదర్శనలు సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఎస్పీజీ కంటే బాగా పనిచేస్తుందనే ముద్ర ఐఎస్‌డబ్ల్యూకు ఉంది: ఏడీజీ విజయ్ కుమార్ 6/17

డాన్.. సింబా.. లియో.. చార్లీ.. టైసన్.. రాణా.. విరాట్.. పోలీసు సాయుధ బలగాల్లో చేరేందుకు ఈ సుశిక్షిత జాగిలాలు సిద్ధమయ్యాయి.

ఎస్పీజీ కంటే బాగా పనిచేస్తుందనే ముద్ర ఐఎస్‌డబ్ల్యూకు ఉంది: ఏడీజీ విజయ్ కుమార్ 7/17

పేలుడు పదార్థాలను పసిగట్టడం.. మాదకద్రవ్యాల్ని గుర్తించడం.. ప్రముఖుల భద్రతకు అడ్వాన్స్ సెక్యూరిటీ లైజనింగ్ నిర్వహించడం తదితన విధులు నిర్వహించంలో ఈ శునకాలు దిట్టలుగా తయారయ్యాయి.

ఎస్పీజీ కంటే బాగా పనిచేస్తుందనే ముద్ర ఐఎస్‌డబ్ల్యూకు ఉంది: ఏడీజీ విజయ్ కుమార్ 8/17

సంక్లిష్టమైన కేసుల పరిశోధనలో దర్యాప్తు అధికారులకు దన్నుగా నిలవడంతోపాటు సంఘ విద్రోహశక్తుల కార్యకలాపాల్ని ముందుగానే పసిగట్టి నియంత్రించేందుకు దోహదపడేలా ఈ జాగిలాలు తర్ఫీదు పొందాయి.

ఎస్పీజీ కంటే బాగా పనిచేస్తుందనే ముద్ర ఐఎస్‌డబ్ల్యూకు ఉంది: ఏడీజీ విజయ్ కుమార్ 9/17

పోలీస్ పరిభాషలో వీటిని కెనైన్‌లుగా పిలుస్తారు.

ఎస్పీజీ కంటే బాగా పనిచేస్తుందనే ముద్ర ఐఎస్‌డబ్ల్యూకు ఉంది: ఏడీజీ విజయ్ కుమార్ 10/17

వీటికి ఈ ఐఐటీఏలో 8 నెలల శిక్షణ పూర్తయింది.

ఎస్పీజీ కంటే బాగా పనిచేస్తుందనే ముద్ర ఐఎస్‌డబ్ల్యూకు ఉంది: ఏడీజీ విజయ్ కుమార్ 11/17

ఈ 25వ బ్యాచ్‌లో తెలంగాణ, బిహార్‌లతోపాటు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో సీఐఎస్ఎఫ్ విభాగంలో సేవలందించేందుకు 76 జాగిలాలకు శిక్షణ ఇచ్చారు.

ఎస్పీజీ కంటే బాగా పనిచేస్తుందనే ముద్ర ఐఎస్‌డబ్ల్యూకు ఉంది: ఏడీజీ విజయ్ కుమార్ 12/17

అందులో లాబ్రడార్ రిట్రీవర్ 29, బెల్జియన్ మాలిన్వా 27, జర్మన్ షెపర్డ్ 14, కాకర్ స్పానియల్ 4, బీగల్2 జాతుల శునకాలు ఉన్నాయి.

ఎస్పీజీ కంటే బాగా పనిచేస్తుందనే ముద్ర ఐఎస్‌డబ్ల్యూకు ఉంది: ఏడీజీ విజయ్ కుమార్ 13/17

వీటితో విధులు నిర్వర్తింపజేసే 105 మంది హ్యాండ్లర్లకు కూడా తర్ఫీదు పూర్తయింది.

ఎస్పీజీ కంటే బాగా పనిచేస్తుందనే ముద్ర ఐఎస్‌డబ్ల్యూకు ఉంది: ఏడీజీ విజయ్ కుమార్ 14/17

మొయినాబాద్ ఐఐటీఏలో 2004లో శిక్షణ ప్రారంభమైంది.

ఎస్పీజీ కంటే బాగా పనిచేస్తుందనే ముద్ర ఐఎస్‌డబ్ల్యూకు ఉంది: ఏడీజీ విజయ్ కుమార్ 15/17

ఇప్పటి వరకు 919 జాగిలాలు, 1310 మంది హ్యాండ్లర్లు తర్ఫీదు పొందారు.

ఎస్పీజీ కంటే బాగా పనిచేస్తుందనే ముద్ర ఐఎస్‌డబ్ల్యూకు ఉంది: ఏడీజీ విజయ్ కుమార్ 16/17

శునకాల్లో 435 రకాలున్నా కేంద్రబలగాలు, పోలీస్ శాఖ 12 జాతుల జాగిలాలను మాత్రమే నేరపరిశోధనకు వినియోగించుకుంటున్నాయి.

ఎస్పీజీ కంటే బాగా పనిచేస్తుందనే ముద్ర ఐఎస్‌డబ్ల్యూకు ఉంది: ఏడీజీ విజయ్ కుమార్ 17/17

ఇతర జీవులతో పోల్చితే జాగిలాలకు వాసన పసిగట్టే శక్తి 40 రెట్లు, వినికిడి శక్తి 20 రెట్లు, కంటిచూపు 10 రెట్లు అధికంగా ఉంటుంది. పేలుడు పదార్థాలను పసిగట్టడంలో ఇవి దిట్టలు.

Updated at - Feb 18 , 2026 | 08:14 AM