ఘనంగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం
ABN, Publish Date - Mar 20 , 2026 | 10:57 AM
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ వేదికగా గురువారం ఘనంగా జరిగింది. ఉగాది పర్వదినాన్ని పురస్కారించుకుని 2025వ సంవత్సరానికి గానూ సినిమా ఇండస్ట్రీలో విశేష ప్రతిభ కనబర్చిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు ప్రదానం చేశారు.
1/10
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ వేదికగా గురువారం ఘనంగా జరిగింది.
2/10
ఉగాది పర్వదినాన్ని పురస్కారించుకుని 2025వ సంవత్సరానికి గానూ సినిమా ఇండస్ట్రీలో విశేష ప్రతిభ కనబర్చిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు ప్రదానం చేశారు.
3/10
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి అవార్డుల సావనీర్‌ను విడుదల చేశారు.
4/10
అనంతరం నటీనటులకు గద్దర్ ఫిల్మ్ అవార్డులు అందజేశారు.
5/10
మెయిన్ స్ట్రీమ్ అవార్డ్స్ అధ్యక్షుడిగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ వ్యవహరించారు.
6/10
షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీ విభాగానికి చైర్మన్‌గా కనకమేడల విజయకృష్ణ, పుస్తకాలు-సమీక్షల పరిశీలనకు చైర్మన్‌గా తనికెళ్ళ భరణి ఉన్నారు.ప్రత్యేక అవార్డుల కమిటీకి అధ్యక్షునిగా తమ్మారెడ్డి భరద్వాజ వ్యవహరించారు.
7/10
వీరితోపాటు జ్యూరీ సభ్యులను తెలంగాణ ప్రభుత్వం జ్ఞాపిక, ప్రశంస పత్రం, నగదుతో సత్కరించింది.
8/10
ఈ వేడుకులకు టాలీవుడ్ నుంచే కాకుండా.. బాలీవుడ్ నుంచి పలువురు నటీనటులు విచ్చేశారు.
9/10
ఎన్టీఆర్ జాతీయ అవార్డు చిరంజీవి, పైడి జయరాజ్ అవార్డు కమలహాసన్ అందుకున్నారు.
10/10
ఏఎన్నార్ అవార్డు సహజ నటి జయసుధ, కాంతారావు అవార్డు ప్రముఖ నటుడు ఆర్.నారాయణ మూర్తి అందుకున్నారు.
Updated at - Mar 20 , 2026 | 11:18 AM