PHFI క్యాంపస్‌కు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

ABN, Publish Date - Nov 15 , 2026 | 09:42 AM

పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (PHFI) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సైన్సెస్ క్యాంపస్‌కు శంకుస్థాపన చేసి, మాస్టర్ ప్లాన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టును 2028 జూన్ 2వ తేదీ నాటికి పూర్తి చేసేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని వెల్లడించారు.

PHFI క్యాంపస్‌కు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి 1/10

పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (PHFI) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సైన్సెస్ క్యాంపస్‌కు శంకుస్థాపన చేసి, మాస్టర్ ప్లాన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం ఆవిష్కరించారు.

PHFI క్యాంపస్‌కు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి 2/10

ఈ ప్రాజెక్టును 2028 జూన్ 2వ తేదీ నాటికి పూర్తి చేసేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని వెల్లడించారు.

PHFI క్యాంపస్‌కు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి 3/10

ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి రూ.12 వేల కోట్ల పెట్టుబడిని పెడుతున్నట్లు సీఎం తెలిపారు.

PHFI క్యాంపస్‌కు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి 4/10

ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఏటా రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు రేవంత్‌రెడ్డి వివరించారు.

PHFI క్యాంపస్‌కు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి 5/10

తెలంగాణలో విధానాల కొనసాగింపు, సంస్థాగత స్థిరత్వం, పెట్టుబడిదారుల విశ్వాసానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

PHFI క్యాంపస్‌కు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి 6/10

విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని సీఎం పేర్కొన్నారు.

PHFI క్యాంపస్‌కు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి 7/10

ఒక దేశ ప్రగతిని పిల్లలకు కల్పించే అవకాశాలు, ప్రజలకు అందించే వైద్య సేవల నాణ్యత ఆధారంగా అంచనా వేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

PHFI క్యాంపస్‌కు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి 8/10

ప్రపంచ స్థాయి విద్య, వైద్యం కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా హైదరాబాద్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

PHFI క్యాంపస్‌కు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి 9/10

తెలంగాణను 2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ను రూపొందించామని సీఎం తెలిపారు.

PHFI క్యాంపస్‌కు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి 10/10

2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated at - Nov 15 , 2026 | 11:06 AM