హైదరాబాద్‌లో జాతీయ విద్యా దినోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి
ABN, Publish Date - Nov 12 , 2026 | 10:54 AM
భారత తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని మైనారిటీ శాఖ హైదరాబాద్ బంజారా భవన్‌లో నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.
1/8
భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని మైనారిటీ శాఖ హైదరాబాద్ బంజారా భవన్‌లో నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.
2/8
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్య, ఉద్యోగాల్లో లక్షలాది మంది ముస్లింలు లబ్ధి పొందుతున్నారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
3/8
ముస్లింల వెనుకబాటుతనాన్ని గుర్తించి ఎన్నో సంవత్సరాలు కష్టపడి పార్టీ తెచ్చిన రిజర్వేషన్ అని, దీన్ని తొలగించేవారు ఇంకా పుట్టలేదని సీఎం పేర్కొన్నారు.
4/8
రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని బీజేపీ నేతలు అంటున్నారని.. వారు ముందుగా గుజరాత్‌లో అమలవుతున్న ముస్లిం రిజర్వేషన్లను తొలగించి చూపాలని సీఎం సవాల్ విసిరారు.
5/8
ఢిల్లీ నుంచి మోదీ, అమిత్ షా ఇక్కడికి బాటసారులుగా వస్తుంటారని.. పోతుంటారని, ఇక్కడ రిజర్వేషన్లు మాత్రం ఎప్పటికీ కొనసాగుతాయని రేవంత్‌రెడ్డి అన్నారు.
6/8
తెలంగాణ గల్లీ నుంచి వెళ్లిన కారు ఢిల్లీ చేరగానే మోదీ కమలంగా మారిపోతోందని బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి సీఎం విమర్శించారు.
7/8
దేశ జనాభాలో 15 శాతం ఉన్న మైనారిటీ వర్గాలు కూడా ప్రగతి సాధించినప్పుడే దేశం ముందడుగు వేస్తుందని సీఎం అన్నారు. మైనారిటీల్లో పేదరికం తొలగించాలన్న ఉద్దేశంతో సచార్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా 4 శాతం రిజర్వేషన్లు కల్పించినట్టు చెప్పారు.
8/8
మారుతున్న పరిస్థితుల్లో విద్య ఒక్కటే సరిపోదని, ప్రపంచవ్యాప్తంగా స్కిల్స్ ఉన్నవారికే ప్రాధాన్యం దక్కుతోందన్నారు. మైనారిటీ యువకుల్లో స్కిల్స్ ఉన్నవారు చాలామంది ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
Updated at - Nov 12 , 2026 | 11:05 AM