పునరుద్ధరించిన శాసనమండలి భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
ABN, Publish Date - Mar 08 , 2026 | 04:18 PM
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఆధునీకరించిన శాసనమండలిని సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం (08-03-2026) ప్రారంభించారు. శాసనమండలిని అత్యాధునిక హంగులతో పునర్నిర్మించారు. వారసత్వ సంపదకు చిహ్నమైన తెలంగాణ పాత అసెంబ్లీ హాలును కొత్త హంగులతో ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సీఎం రేవంత్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
1/5
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఆధునీకరించిన శాసనమండలిని సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం (08-03-2026) ప్రారంభించారు. శాసనమండలిని అత్యాధునిక హంగులతో పునర్నిర్మించారు.
2/5
వారసత్వ సంపదకు చిహ్నమైన తెలంగాణ పాత అసెంబ్లీ హాలును కొత్త హంగులతో ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సీఎం రేవంత్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
3/5
ఈ సందర్భంగా మండలిలో చైర్మన్, మంత్రులతో కలసి కూర్చుని సీఎం రేవంత్ కొద్దిసేపు ముచ్చటించారు.
4/5
శాసన మండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.
5/5
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క్‌తోపాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, దామోదర్ రాజనర్సింహరావు, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామితోపాటు అసెంబ్లీ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
Updated at - Mar 08 , 2026 | 04:23 PM