ప్రధాని మోదీ సభ కోసం ఏర్పాట్లు పర్యవేక్షించిన టీబీజేపీ చీఫ్
ABN, Publish Date - May 08 , 2026 | 03:47 PM
ప్రధాని నరేంద్ర మోదీ మే 10వ తేదీ ఆదివారం తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు శుక్రవారం పర్యవేక్షించారు.
1/10
ప్రధాని నరేంద్ర మోదీ మే 10వ తేదీ ఆదివారం తెలంగాణలో పర్యటించనున్నారు.
2/10
ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించున్నారు.
3/10
సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్‌లో సభకు ఆయన హాజరవుతారు.
4/10
అనంతరం సాయంత్రం 6.45 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు తిరిగి వెళ్లనున్నారు.
5/10
ఈ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్.రామచందర్ రావు పర్యవేక్షించారు.
6/10
అనంతరం మోదీ పర్యటనకు సంబంధించిన వివరాలను ఆయన వివరించారు. ప్రధాని మోదీ షెడ్యూల్ ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రత్యేక విమానంలో బెంగళూరు నుంచి బయలుదేరి 2.20 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.
7/10
అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లి వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
8/10
అనంతరం 3.45 నుంచి 4.15 గంటల వరకు మాదాపూర్ హైటెక్ సిటీలోని సింధు ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
9/10
ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
10/10
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ సభకు లక్షలాది మంది ప్రజలు తరలి వస్తారని బీజేపీ రాష్ట్ర నేతలు అంచనా వేస్తున్నారు.
Updated at - May 08 , 2026 | 04:15 PM