మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 25 కేంద్రాల్లో ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష
ABN, Publish Date - Nov 29 , 2026 | 01:57 PM
మహబూబ్నగర్ జిల్లాలో ఎస్సై ఉద్యోగాల కోసం ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 25 కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్ష రాశారు.
1/6
మహబూబ్నగర్ జిల్లాలో ఎస్సై ఉద్యోగాల కోసం ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 25 కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్ష రాయగా.. పరీక్షా కేంద్రాలను స్వయంగా సందర్శించిన జిల్లా ఎస్పీ ఏర్పాట్లను పరిశీలించారు.
2/6
మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలో 25 కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్ష రాయగా.. జిల్లా ఎస్పీ పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. పరీక్షల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.
3/6
తెలంగాణ వ్యాప్తంగా ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 25 పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్ష రాశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థులను సిబ్బంది నిశితంగా చెక్ చేసిన తరువాతనే హాల్లోపలికి అనుమతించారు.
4/6
ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు ఎక్కువ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. చిన్నపిల్లల తల్లులు కూడా పరీక్షకు హాజరవ్వడంతో.. పరీక్షా కేంద్రం వద్ద వారి కుటుంబసభ్యులు పిల్లలను చూసుకోవడంతో కేంద్రాల వద్ద సందడి నెలకొంది.
5/6
ఎస్సై పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించని కారణంగా గంట ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకున్నారు.
6/6
తెలంగాణ వ్యాప్తంగా ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలను అందుబాటులో ఉంచడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
Updated at - Nov 29 , 2026 | 01:58 PM