తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత
ABN, Publish Date - Mar 06 , 2026 | 02:56 PM
దేశవ్యాప్తంగా సంచలనం సృస్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు క్లీన్ చిట్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి మెట్ల మార్గంలో నడుచుకుంటూ తిరుమల చేరుకున్నారు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు.
1/6
మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు గుమ్మడికాయతో దిష్టి తీస్తున్న వృద్ధురాలు.
2/6
కుటుంబ సభ్యులు, కార్యకర్తలతో కలిసి కొండపైకి కాలి నడక మార్గాన వెళ్లిన కవిత. స్వామివారి అభిషేక సేవలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
3/6
కొడుకు ఆదిత్యతో కలిసి ఆలయంలో ప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకున్న కల్వకుంట కవిత.
4/6
కార్యకర్తలతో కలిసి అలిపిరి మెట్ల మార్గంలో నడుచుకుంటూ తిరుమలకు చేరుకున్న కల్వకుంట్ల కవిత
5/6
శ్రీవారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకున్నానని, స్వామి వారి ఆశీస్సులతో తన నాలుగేళ్ల మనోవేదన తీరిపోయిందని కవిత తెలిపారు.
6/6
కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆలయం వద్ద ఫోటో షూట్ లో పాల్గొన్న కవిత.
Updated at - Mar 06 , 2026 | 02:57 PM