కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ..

ABN, Publish Date - Apr 10 , 2026 | 04:13 PM

బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ పార్టీ మాజీ నేత టి. జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. శుక్రవారం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లో కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ అయ్యారు. జగిత్యాల నుంచి ఫామ్ హౌస్‌కు చేరిన జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌తోపాటు ఆ పార్టీ నేతలు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డికి కేటీఆర్ శాలువా కప్పారు.

కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ.. 1/8

బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ పార్టీ మాజీ నేత టి. జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. శుక్రవారం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లో కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ అయ్యారు.

కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ.. 2/8

జగిత్యాల నుంచి ఫామ్ హౌస్‌కు చేరిన జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌తోపాటు ఆ పార్టీ నేతలు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డికి కేటీఆర్ శాలువా కప్పారు.

కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ.. 3/8

అనంతరం ఫామ్‌హౌస్‌లోని కేసీఆర్ వద్దకు జీవన్ రెడ్డిని తీసుకెళ్లారు. కేసీఆర్, జీవన్ రెడ్డి ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఈ భేటీలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరికకు ముహూర్తంతోపాటు ఎక్కడ చేరాలనే అంశంపై ఒక స్పష్టం వచ్చినట్లు తెలుస్తుంది.

కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ.. 4/8

జగిత్యాలలోనే భారీ సభ ఏర్పాటు చేసి జీవన్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవాలనే తలంపుతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఉన్నట్లు సమాచారం.

కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ.. 5/8

గురువారం జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. ఆయన్ని బీఆర్ఎస్ పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించారు.

కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ.. 6/8

ఈ సందర్భంగా వారిరువురి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. ఆ మరునాడే జీవన్ రెడ్డి ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు. దశాబ్దాలు పాటు కాంగ్రెస్‌లోనే ఉన్నా తనకు కాంగ్రెస్ అన్యాయం చేసిందంటూ జీవన్ రెడ్డి ఆరోపించిన విషయం విదితమే.

కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ.. 7/8

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తాను తీవ్ర నిర్లక్ష్యానికి గురైయ్యాయనని జీవన్ రెడ్డి వివిధ సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ.. 8/8

ఈ పర్యటనలో జీవన్ రెడ్డి వెంట ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నేతలతోపాటు ఆయన ప్రధాన అనుచరులు ఉన్నారు.

Updated at - Apr 10 , 2026 | 04:17 PM